పండుకో పండుగ

కులమతాలకు అతీతంగా కేరళలోని కన్నూర్‌ జిల్లా కన్నాపురంలో ఓ పండుగ చేసుకుంటారు గ్రామస్థులు. అదే మామిడి పండుగ.

Updated : 21 May 2023 04:29 IST

కులమతాలకు అతీతంగా కేరళలోని కన్నూర్‌ జిల్లా కన్నాపురంలో ఓ పండుగ చేసుకుంటారు గ్రామస్థులు. అదే మామిడి పండుగ. పండు కోసం పండుగ ఏంటీ అనుకుంటున్నారా... కన్నాపురంలో షైజు మాఛాతీ అనే ప్రకృతి ప్రేమికుడు- తమ గ్రామంలోని మామిడి చెట్లు ఏయే జాతులకు చెందినవో తెలుసుకోవాలనుకున్నాడు. వ్యవసాయ శాఖలో పనిచేసే కొందరు మిత్రుల సాయంతో అక్కడున్న దాదాపు 400 చెట్లలో 200లకు పైనే మామిడి జాతులు ఉన్నట్టు గుర్తించాడు. దాంతో ఆ చెట్లను ‘నాటు మాంజోత్తిల్‌’ పేరుతో ఓ ఫేస్‌బుక్‌ పేజీని ఏర్పాటు చేసి- ఆ మామిడి రకాల గురించి పంచుకోవడం మొదలుపెట్టాడు షైజు. మరోవైపు గ్రామస్థులు కూడా తమ పెరట్లోని మామిడి రకాలకు అంటుకట్టి కొత్తవి సృష్టించడం ప్రారంభించారు.  తమ ఊరి మామిడి వైవిధ్యానికి గుర్తుగా ఏటా వేసవిలో- ఏడాదంతా కాయలు కాసే కుల నిర్యాన్‌, కొబ్బరికాయంత పెద్దగా ఉండే తేెంగా, కన్నాపురం, పులియన్‌, కుడక్కచ్చి, బప్పకాయ్‌, చెరి వంటి దాదాపు 200 రకాల మామిడి జాతులను ప్రదర్శించి పండుగ చేసుకోవడం మొదలుపెట్టారు. అలానే ఆ రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు కన్నాపురాన్ని ‘స్వదేశీ
మామిడి వారసత్వ ప్రాంతం’గానూ గుర్తించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..