గర్భిణులకు గ్రంథాలయం
అమ్మాయి అమ్మ కావడమంటే పునర్జన్మనెత్తడమే. తొమ్మిది నెలల పాటు తన ఆరోగ్యాన్నేకాదు.. కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్నీ భద్రంగా కాపాడుకోవాలి.
అమ్మాయి అమ్మ కావడమంటే పునర్జన్మనెత్తడమే. తొమ్మిది నెలల పాటు తన ఆరోగ్యాన్నేకాదు.. కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్నీ భద్రంగా కాపాడుకోవాలి. ఈ క్రమంలో ఎన్నో సమస్యలూ, సందేహాలూ ఎదురవు తుంటాయి. కొంత మానసిక ఒత్తిడీ ఉంటుంది. అవన్నీ బిడ్డ ఆరోగ్యం మీద ప్రభావం చూపకుండా జాగ్రత్తగా ఉండాలి. అందుకే గర్భిణుల ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టారు తమిళనాడులోని తంజావూరు జిల్లా వైద్యాధికారులు. అక్కడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వచ్చే గర్భిణుల కోసం ఓ గ్రంథాలయం ఏర్పాటు చేసి ఆరోగ్య చిట్కాలూ, మానసిక ఉల్లాసాన్ని పంచే కథలూ, స్ఫూర్తినిచ్చే జీవిత చర్రితలూ, హాస్య పుస్తకాలను అందుబాటులో ఉంచారు. దాదాపు మూడు వేల పుస్తకాలున్న ఆ గ్రంథాలయంలో గర్భిణులూ, బాలింతలూ చదువుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పుస్తకాలు చదవడం వల్ల సానుకూల ఆలోచనలు కలగడంతోపాటు, పుట్టబోయే బిడ్డకు జ్ఞాపకశక్తి బాగుంటుందని అధికారులు ఈ ఏర్పాటు చేశారు. దీనికి మంచి స్పందన వస్తుండటంతో అన్ని జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇటువంటి గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు అధికారులు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Karnataka: ఇలాగే వదిలేస్తే కర్ణాటకలో కసబ్, లాడెన్ ఫొటోలు ప్రదర్శిస్తారు: భాజపా నేత సీటీ రవి
-
Asian Games: ఆసియా క్రీడలు.. నీరజ్‌కు స్వర్ణం, కిశోర్‌కు రజతం
-
Chandrababu Arrest: ఆంక్షలు దాటి, పోలీసుల కళ్లు కప్పి.. ర్యాలీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Sanjay Singh: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టు
-
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త
-
Rohit On WC 2023: మా టార్గెట్ అదే.. అలాంటి పోలికలను పట్టించుకోం: రోహిత్