కదిలే బడి

స్వచ్ఛంద సంస్థలు మురికివాడల పిల్లలకోసం బస్సులను తరగతి గదిగా మార్చేయడం మనకు తెలిసిందే.

Updated : 04 Jun 2023 04:18 IST

స్వచ్ఛంద సంస్థలు మురికివాడల పిల్లలకోసం బస్సులను తరగతి గదిగా మార్చేయడం మనకు తెలిసిందే. అయితే ధనవంతులకే అందుబాటులో ఉండే ఓ విద్యాసంస్థ పేద పిల్లలకోసం బస్‌ స్కూల్‌ను అందుబాటులోకి తేవడం ఇక్కడ విశేషం. సూరత్‌లోని విద్యాకుంజ్‌- విద్యాపీఠ్‌ గ్రూపు సంస్థకు ఆ ప్రాంతంలో మంచి పేరుంది. కానీ, అక్కడ ధనవంతులకే చదువు అందుబాటులో ఉంటుంది. అంతంత ఫీజులు కట్టలేని పేదలకు కూడా ఆ కార్పొరేట్‌ చదువులు అందుబాటులో ఉంచాలని స్కూలు యాజమాన్యం బస్సును హైటెక్‌ క్లాస్‌ రూమ్‌గా మార్చింది. బల్లలూ, ఎల్‌ఈడీ తెర, ఇంటర్నెట్‌, ఏసీ వసతులన్నీ ఏర్పాటు చేసి మురికివాడలకూ, వలస కార్మికులుండే ప్రాంతాలకూ పంపుతోంది. స్పోకెన్‌ ఇంగ్లిషుతోపాటు, ఆ పిల్లల స్థాయిని బట్టి పాఠాలు బోధిస్తున్నారు టీచర్లు. అందుకోసం దాదాపు పది బస్సులను బడిగా మార్చి...  పేదల పిల్లల్ని చదివిస్తోంది విద్యాకుంజ్‌ సంస్థ. అంతేకాదు పిల్లలు ఆసక్తిగా చదువు కోవడానికి రావాలనే ఉద్దేశంతో- బస్సుల్ని పలు ప్రాంతాలకు తీసుకెళు తుంటారు. అంటే కదిలే బస్సులోనే పిల్లలు పాఠాలు వింటారన్నమాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..