ఇవి ‘లిక్విడ్’ చెట్లు!
సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో బొగ్గుగనులే ప్రధాన జీవనాధారం. కానీ, గనుల వల్ల ఐరోపాలోనే అత్యంత కలుషిత నగరంగా ఇది పేరుమోసింది.
సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో బొగ్గుగనులే ప్రధాన జీవనాధారం. కానీ, గనుల వల్ల ఐరోపాలోనే అత్యంత కలుషిత నగరంగా ఇది పేరుమోసింది. ఆ సమస్యని తగ్గిద్దామని చెట్లు పెంచాలనుకుంటే ఖాళీ స్థలమే లేకపోయింది. అతికష్టంపైన స్థలాన్ని వెతికిపట్టి మొక్కలు పెంచినా కాలుష్యానికి చచ్చిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి శాస్త్రవేత్తలు ‘ద్రవరూప చెట్టు’ యంత్రాన్ని రూపొందించారు! చూడటానికి అద్దాలతో చేసిన పెద్ద వాటర్ ట్యాంకర్‌లా ఉంటుందీ యంత్రం. అందులో ఆరువందల లీటర్ల నీళ్లు నింపి ‘మైక్రో ఆల్గే’ అనే నాచులాంటి పదార్థాన్ని వేస్తారు. ఆ నాచు చెట్లలాగే సూర్యరశ్మిని తీసుకుని పచ్చదనాన్ని పెంచుకుంటుంది. ఆ క్రమంలో కార్బన్‌డైయాక్సైడ్‌ని పీల్చుకుని ఆక్సిజన్‌ని విడుదలచేస్తుంది. పైగా ఆ ప్రక్రియను అత్యంత వేగంగా చేస్తుంది. ఎంతగా అంటే... ఈ ఒక్క యంత్రం పదేళ్ళు నిండిన రెండు పెద్దచెట్లకి సమానమట! అందుకే వీటిని బెల్‌గ్రేడ్ నగరంలో పెట్టి... వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తున్నారు! అంతేకాదు, సౌరఫలకాల సాయంతో ఛార్జింగ్ పాయింట్‌గానూ పాదచారులు సేదతీరే పెద్ద కుర్చీగానూ వాడుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
YSRCP: వైకాపా జిల్లా అధ్యక్షుల మార్పు
-
Vizag: ఫోర్జరీ సంతకాలతో ముదపాక భూముల విక్రయం
-
Rahul Gandhi: భారాస అంటే భాజపా రిస్తేదార్ సమితి: రాహుల్
-
TDP: ‘ఐప్యాక్‌కు రూ.274 కోట్లు అప్పనంగా దోచిపెట్టారు’
-
Jangaon: విద్యుత్తు స్తంభంపై కార్మికుని నరకయాతన
-
దిల్లీ మద్యం కేసులో అప్రూవర్లుగా మాగుంట రాఘవ్, దినేష్ అరోరా