ఆఫీసులో అరటి పండు!

వ్యవసాయంలో భాగంగా అరటి పండ్లను పండించేవారిని చూస్తుంటాం. అమ్ముకోవడంలో భాగంగా పండించే వ్యాపారులు కూడా కనిపిస్తారు.

Published : 16 Jun 2024 00:13 IST

వ్యవసాయంలో భాగంగా అరటి పండ్లను పండించేవారిని చూస్తుంటాం. అమ్ముకోవడంలో భాగంగా పండించే వ్యాపారులు కూడా కనిపిస్తారు. రైతులూ, వ్యాపారులూ కాకుండా చైనాలోని కార్పొరేట్‌ ఉద్యోగులు తమ డెస్కుల వద్ద  ఈ మధ్య అరటి పండ్లని పండిస్తున్నారట. ఇక్కడ ‘పండించడం’ అంటే అరటితోటలు సాగు చేయడం కాదు... పచ్చిగెలని తెచ్చి మగ్గబెట్టడం. మరి ఉన్నపళంగా ఆ పని ఎందుకు చేస్తున్నారని చైనా ఉద్యోగుల్ని అడిగితే- ఒత్తిడిని పోగొట్టుకోడానికి అని బదులిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ డెస్కులపైన నీళ్లు నింపిన గాజు జారులో పచ్చి అరటి గెలని ఉంచి- వారం పది రోజుల్లో పండిన ఆ కాయలను అందరూ కలిసి తినడం ఇప్పుడక్కడ ట్రెండ్‌. ఎందుకంటే అరటి కాయలు రంగు మారే క్రమాన్ని చూడ్డం వల్ల- పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆలోచనలు మారతాయనీ, ఆ రంగు ప్రభావం మనసుపైన పడి కాస్త ఉపశమనం లభిస్తుందనీ అక్కడి ఉద్యోగులు భావించి ఈ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారట. అంతేకాదు, పండిన పండ్లని అందరికీ పంచి స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించుకుంటున్నారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..