వానొచ్చెనంటే బొమ్మొచ్చెనంట!

వర్షాలు పడుతున్నప్పుడు మన రోడ్లను అస్సలు ఊహించు కోలేం. కొద్దిపాటి వర్షానికే మోకాల్లోతు నీళ్లు నిలిచిపోయి కాలు బయట పెట్టే పరిస్థితి ఉండదు చాలా చోట్ల.

Published : 16 Jun 2024 00:15 IST

ర్షాలు పడుతున్నప్పుడు మన రోడ్లను అస్సలు ఊహించు కోలేం. కొద్దిపాటి వర్షానికే మోకాల్లోతు నీళ్లు నిలిచిపోయి కాలు బయట పెట్టే పరిస్థితి ఉండదు చాలా చోట్ల. అదే దక్షిణకొరియా రాజధాని సియోల్‌ రోడ్లు మాత్రం వర్షాకాలంలో చూడ్డానికి ఎంత బాగుంటాయో. రంగు రంగుల బొమ్మలతో కాన్వాసులా మారిపోయి కళ్లకు కనికట్టు చేస్తుంటాయి. అలాంటప్పుడు ఏడాదంతా చూడొచ్చు కదా... కేవలం వర్షాకాలంలోనే ఆ రోడ్లను ఎందుకు చూడాలి అనే సందేహం రావచ్చు.  అక్కడే ఉంది విశేషం.. మామూలు రోజుల్లో తారు రోడ్డులానే కనిపిస్తాయి సియోల్‌ రహదారులు. నాలుగు చినుకులు పడగానే ఆ రోడ్లపైన అందంగా మెరిసిపోయే బొమ్మలు ప్రత్యక్షమై ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటాయి. అలాగని అదేమీ ప్రకృతి వింతో విచిత్రమో కాదు. మామూలు రోజుల్లో పారదర్శకంగా ఉంటూ, తడి తగలగానే కాంతినిరోధకంగా మారిపోయే హైడ్రోక్రోమిక్‌ పెయింట్‌తో రోడ్డుపైన ఆ బొమ్మలను చిత్రించడమే అందుకు కారణం. వర్షం పడినప్పుడు ప్రయాణమంటే చాలామందికి చిరాగ్గా ఉంటుంది. అలా సియోల్‌ వాసులు ఇబ్బంది పడటం చూసిన పాంటోన్‌ అనే పెయింట్‌ కంపెనీ- ‘ప్రాజెక్టు మాన్సూన్‌’ పేరుతో రోడ్ల మీద హైడ్రోక్రోమిక్‌ పెయింట్లతో రకరకాల చిత్రాలను గీయించింది. అందుకే వర్షం పడగానే అక్కడి రోడ్లు మేజిక్‌ చేస్తుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు