ఆ ప్రయాణానికి అడ్డుకట్ట!

కాలేజీలకు బస్సుల్లో వెళ్లే చాలామందికి ఫుట్‌ బోర్డ్‌ ప్రయాణం అలవాటే. కొందరు అలా తప్పనిసరై వెళితే మరికొందరు సరదాగా వెళుతుంటారు.

Published : 16 Jun 2024 00:18 IST

కాలేజీలకు బస్సుల్లో వెళ్లే చాలామందికి ఫుట్‌ బోర్డ్‌ ప్రయాణం అలవాటే. కొందరు అలా తప్పనిసరై వెళితే మరికొందరు సరదాగా వెళుతుంటారు. కానీ బస్సు మెట్లపైన వేలాడుతూ ప్రయాణించి- ఎందరో విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, కొందరు అవయవాలు కోల్పోతున్నారు. ఆ పరిస్థితులన్నీ గమనించిన తమిళనాడు ప్రభుత్వం విద్యార్థులను ఎన్నోసార్లు హెచ్చరించినా ఫలితం లేకపోయింది. ఎలాగైనా విద్యార్థులను కాపాడాలనుకున్న ‘మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌’ (ఎంటీసీ) అధికారులు- మెట్రో రైలు తరహాలో బస్సులకు డోర్లు పెట్టించారు. బస్టాపులో బస్సు ఆగగానే తలుపులు వాటంతట అవే తెరుచుని... కదలగానే మూసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆ డోర్ల వల్ల ఎవరూ మెట్లపైన నిల్చునే అవకాశం ఉండదన్నమాట. స్కూళ్లూ, కాలేజీలూ తెరిచేటప్పటికి చెన్నై నగరంలో తిరిగే ప్రభుత్వ బస్సులన్నింటికీ ఆటోమేటిక్‌ డోర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..