ముసుగు తోటలు!

తోటలనగానే ఎక్కడైనా ఆకుపచ్చ రంగు పులుముకున్నట్టు కనిపిస్తాయి. ఆకాశం నుంచి చూస్తే పుడమి తల్లి పచ్చని దుప్పటి కప్పుకుందా అనిపిస్తుంటుంది.

Updated : 16 Jun 2024 04:38 IST

తోటలనగానే ఎక్కడైనా ఆకుపచ్చ రంగు పులుముకున్నట్టు కనిపిస్తాయి. ఆకాశం నుంచి చూస్తే పుడమి తల్లి పచ్చని దుప్పటి కప్పుకుందా అనిపిస్తుంటుంది. అమెరికాలోని న్యూజెర్సీ, ఫ్లోరిడాతోపాటు కొన్ని రాష్ట్రాలకు వెళితే కొందరి పంట పొలాలు తెల్లగా మిలమిల మెరుస్తుంటాయి. మరి అలా ఎందుకు ఉంటాయో తెలుసు కోవాలంటే ఆ పొలాలకు వెళ్లాల్సిందే. సాధారణంగా నిమ్మ, నారింజ, బత్తాయి, కమలా వంటి ఫలాల్లో గింజలు ఉంటాయి. జ్యూసులు చేసేటప్పుడూ, తొనలు తినేటప్పుడూ ఆ గింజల్ని వేరు చేస్తుంటాం. అదంత పెద్ద కష్టం కూడా కాదు. ఫార్మా, కాస్మెటిక్‌ రంగాల్లో పెద్ద ఎత్తున వీటిని వాడతారు కాబట్టి అలాంటప్పుడు కాస్త ఇబ్బందే. అందుకే అక్కడి రైతులు గింజలు లేకుండానే నిమ్మజాతి ఫలాలను పండించాలనుకున్నారు. సీడ్‌లెస్‌ కాయలు కాసే విత్తనాలు నాటి- తోటలు పూతకొచ్చే సమయానికి తేనెటీగలు పరపరాగ సంపర్కం జరపకుండా చెట్లని వలలతో కప్పేసి- తద్వారా సీడ్‌లెస్‌ పండ్లని పండిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..