చిన్నారి గైడ్‌లు

చారిత్రక ప్రదేశాలకు వెళ్లినప్పుడు చాలామంది గైడ్‌ల సాయం తీసుకుంటారు. సాధారణంగా గైడ్‌లు అనగానే పెద్దవాళ్లే కనిపిస్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో తాజ్‌మహల్‌కి సమీపంలో ఉన్న ఫతేపూర్‌ సిక్రీ వెళితే ఐదారేళ్ల పిల్లలే చరిత్ర పాఠాలు చెబుతారు.

Published : 23 Jun 2024 00:16 IST

చారిత్రక ప్రదేశాలకు వెళ్లినప్పుడు చాలామంది గైడ్‌ల సాయం తీసుకుంటారు. సాధారణంగా గైడ్‌లు అనగానే పెద్దవాళ్లే కనిపిస్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో తాజ్‌మహల్‌కి సమీపంలో ఉన్న ఫతేపూర్‌ సిక్రీ వెళితే ఐదారేళ్ల పిల్లలే చరిత్ర పాఠాలు చెబుతారు. మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌ కట్టించిన ఆ అద్భుత నగరం గురించీ, అక్కడున్న రాజభవనాలూ, ఇతర కట్టడాల కళా వైభవం గురించీ మాటల్లోనే కళ్లకు కడతారు. ఐదేళ్ల నుంచి పదిహేనేళ్ల లోపు పిల్లల అక్కడ గైడ్‌లుగా తారసపడుతుంటారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఫతేపూర్‌ సిక్రీని ఆనుకుని ఉన్న ఓ బస్తీలో- ఏ ఇంట్లో చూసినా కటిక పేదరికంతో బాధపడేవారే కనిపిస్తారు. పెద్దలంతా పనులకు వెళ్లి.. పిల్లల్ని గైడ్‌లుగా పంపుతుంటారు. అందుకోసం చిన్నారులను బడికి పంపకుండా కోచింగ్‌ సెంటర్లకు పంపి ఇంగ్లిష్‌తోపాటు, చరిత్ర పాఠాలనూ నేర్పించి గైడ్‌లుగా మార్చుతున్నారు తల్లిదండ్రులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు