చేపల పండుగ

కొత్త పంటలు వేసే ముందు చాలా గ్రామాల్లో ప్రకృతిని ఆరాధిస్తుంటారు. అందులో భాగంగా తమిళనాడులోని మదురై సమీపంలోని కళ్లంధిరి గ్రామంలో వందల ఏళ్లుగా ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు ప్రజలు.

Published : 23 Jun 2024 00:18 IST

కొత్త పంటలు వేసే ముందు చాలా గ్రామాల్లో ప్రకృతిని ఆరాధిస్తుంటారు. అందులో భాగంగా తమిళనాడులోని మదురై సమీపంలోని కళ్లంధిరి గ్రామంలో వందల ఏళ్లుగా ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు ప్రజలు. ఆ ప్రాంతంలోని రెండొందల ఎకరాల చెరువుపైన ఆధారపడి చుట్టుపక్కల ఐదు గ్రామాల ప్రజలు వ్యవసాయం చేస్తుంటారు. వారంతా వర్షాలు పడ్డాక చేప పిల్లల్ని స్థానిక ఆలయంలో నైవేద్యంగా సమర్పించి- తరవాత చెరువులో వదిలేస్తారు. వేసవి ముగిసి మళ్లీ వర్షాలు మొదలయ్యాక ఓ మంచి రోజు చూసుకుని ఐదు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి చేపలు పట్టుకుంటారు. తరవాత అందరూ కలిసి ఆ చేపలతో కూర వండి- గ్రామ దేవతకి నైవేద్యంగా పెడతారు. కొన్ని చేపలను బంధుమిత్రులకు పంచుతారు. ఇలా చేయడం వల్ల పంటలు బాగా పండి, ప్రజల ఆరోగ్యం బాగుంటుందని అక్కడి వారు తరతరాలుగా నమ్ముతున్నారు. ఏటా అలా రైతులు పెద్ద ఎత్తున చేపలు పడుతుంటే చూడ్డానికి వేలాది మంది వస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..