ఈ చెట్టుకు ఆడతోడు కావాలి!

మనుషులకు తోడు అవసరం కాబట్టి- పెళ్లీడుకొచ్చిన మగపిల్లలకు తగిన అమ్మాయిలను ఇంట్లో వాళ్లు వెతికి పెట్టడం సహజం. అయితే ఎప్పుడైనా చెట్లకి తోడును వెతకడం చూశారా!!

Published : 23 Jun 2024 00:20 IST

నుషులకు తోడు అవసరం కాబట్టి- పెళ్లీడుకొచ్చిన మగపిల్లలకు తగిన అమ్మాయిలను ఇంట్లో వాళ్లు వెతికి పెట్టడం సహజం. అయితే ఎప్పుడైనా చెట్లకి తోడును వెతకడం చూశారా!! ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌ యూనివర్సిటీకి వెళితే తోడును కోరుకునే చెట్టునూ, అందుకోసం వెతికే శాస్త్రవేత్తలనూ మనం చూడొచ్చు. చాలా ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికాలోని నోయే అడవిలో మొదటిసారి ‘ఎన్‌సెపలోటాస్‌ వూడి’ అనే చెట్టును కనుగొన్నారు శాస్త్రవేత్తలు. పర్యావరణానికి మేలు చేసే వూడీ వృక్షాలను చాలానే గుర్తించారు కానీ అవన్నీ మగవే. ఎక్కడా ఆడ చెట్టు ఆనవాళ్లు దొరకలేదు. అయితే ఇప్పుడా మగచెట్లు అంతరించిపోయే దశకు రావడంతో శాస్త్రవేత్తలు వాటికి తోడును వెతికే పనిలో పడ్డారు. అందుకోసం సౌతాంప్టన్‌ యూనివర్సిటీ సాయం తీసుకుని ప్రపంచంలోని అడవులన్నీ జల్లెడ పడుతున్నారు. డ్రోన్‌ కెమెరాలను రంగంలోకి దించి వీడియోలూ, ఫొటోలూ తీయిస్తున్నారు. ఏఐ సాయంతో వాటిలో ఎక్కడైనా ఆడ వూడీ ఆనవాళ్లు కనిపిస్తాయేమోనని వెతుకుతున్నారు. వూడీకి పెద్ద కష్టమే వచ్చిపడింది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..