కుక్కలే కాపాడతాయి!

కొన్ని పెద్ద సంస్థల్లో మొక్కలను ట్రిమ్‌ చేయడానికి మేకలకూ, పార్కుల్లో సిగరెట్టు పీకలను ఏరడానికి కాకులకూ ఉద్యోగాలిచ్చారని వార్తలొచ్చాయి.

Published : 23 Jun 2024 00:24 IST

కొన్ని పెద్ద సంస్థల్లో మొక్కలను ట్రిమ్‌ చేయడానికి మేకలకూ, పార్కుల్లో సిగరెట్టు పీకలను ఏరడానికి కాకులకూ ఉద్యోగాలిచ్చారని వార్తలొచ్చాయి. క్రొయేషియా దేశంలో ఏకంగా కుక్కలకి ప్రాణాలు కాపాడే ఉద్యోగాన్నే ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. అందుకోసం దాదాపు యాభై కుక్కలకు లైఫ్‌ గార్డులుగా ఉద్యోగమిచ్చి పని చేయిస్తోంది. పర్యటక దేశమైన క్రొయేషియాలో సముద్ర తీర ప్రాంతాలకు ఎంతో పేరుంది. అందుకే అక్కడి బీచ్‌లకు లక్షలాది జనాలు వెళుతుంటారు. అయితే చాలామంది అలల తాకిడికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారట. అలాంటివాళ్లని కాపాడటానికి- న్యూఫౌండ్లాండ్‌, గోల్డెన్‌ రిట్రీవర్‌, లాబ్రడార్‌ జాతికి చెందిన కుక్కలకు దాదాపు మూడేళ్ల పాటు శిక్షణ ఇచ్చి బీచ్‌లో లైఫ్‌ గార్డులుగా నియమించారు అధికారులు. అలలకు కొట్టుకుపోయేవారిని గమనిస్తూ తక్షణమే సముద్రంవైపు పరుగులు తీస్తాయి కొన్ని. మరికొన్నేమో గజ ఈతగాళ్లకు సాయంగా సముద్రం లోపలి వరకూ వెళుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..