Updated : 29 Jan 2023 03:35 IST

పదవీ విరమణ తరవాత..!

త్వరగా రిటైరైతే హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు అనుకుంటారు కొందరు. కానీ దానివల్ల మెదడు పనితీరూ త్వరగా మందగిస్తుందని బింగ్‌హ్యాంప్టన్‌ విశ్వవిద్యాలయ నిపుణులు చెబుతున్నారు. అయితే ముందే రిటైర్మెంటు తీసుకున్నప్పటికీ సామాజికంగా చురుకుగా ఉన్నవాళ్లలో ఈ సమస్య ఉండదట. ఈ విషయమై పరిశోధకులు అరవై నిండకుండానే రిటైరైన ఉద్యోగుల్నీ అరవై దాటినా పనిచేస్తున్నవాళ్లనీ పరిశీలించినప్పుడు- చిత్రమైన ఫలితాలు కనిపించాయట. ముందుగా రిటైరయిన వాళ్లలో ఆలోచనాశక్తి తగ్గింది కానీ అదేసమయంలో పనిచేసేవాళ్లతో పోలిస్తే వీళ్లు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారట. వీళ్లు వేళకు తిని పడుకోవడమే ఇందుకు కారణం కావచ్చు అని భావిస్తున్నారు. దీన్నిబట్టి సామాజికంగా చురుకుగా లేకపోవడమే మెదడు పనితీరు తగ్గడానికి కారణమనీ, కాబట్టి ముందే రిటైరయినప్పటికీ సామాజికంగానూ శారీరకంగానూ చురుకుగా ఉంటే ఎలాంటి సమస్యలూ ఉండవనీ చెప్పుకొస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు