ఉడికించి తింటే మేలు!

వేరుసెనగ పప్పులు తింటే కొందరికి అలర్జీలు వస్తుంటాయి. అలాంటివాళ్లకు ఒక్కసారే వేయించినవి కాకుండా ఉడికించినవి పెడితే క్రమేణా శరీరం పల్లీలకు అలవాటు పడుతుంది అంటున్నారు ఫ్లిండర్స్‌ యూనివర్సిటీ నిపుణులు.

Updated : 28 Jan 2023 23:15 IST

ఉడికించి తింటే మేలు!

వేరుసెనగ పప్పులు తింటే కొందరికి అలర్జీలు వస్తుంటాయి. అలాంటివాళ్లకు ఒక్కసారే వేయించినవి కాకుండా ఉడికించినవి పెడితే క్రమేణా శరీరం పల్లీలకు అలవాటు పడుతుంది అంటున్నారు ఫ్లిండర్స్‌ యూనివర్సిటీ నిపుణులు. ముఖ్యంగా 7 నుంచి 18 సంవత్సరాల వయసు పిల్లల్లో పల్లీల అలర్జీలు ఎక్కువ. అందులోని ప్రొటీన్‌ జీర్ణం కాదనీ అలర్జీలు వస్తాయనీ వాటిని పెట్టడం మానేస్తుంటారు. అలా మొత్తంగా మానేయడం కన్నా ఓరల్‌ ఇమ్యూనోథెరపీలో భాగంగా కొంచెంకొంచెంగా వేరుసెనగపప్పుల్ని ఇస్తే అలర్జీని తట్టుకునే శక్తి వాళ్లలో క్రమేణా పెరుగుతుంది అని చెబుతున్నారు. అదీ ఉడికించినవి పెట్టినప్పుడు అలర్జీ శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

ఇందుకోసం ముందుగా నాలుగైదు నెలలపాటు ఉడికించినవి ఇచ్చి, ఆపై వేయించినవి పెట్టడం వల్ల క్రమేణా వాళ్లలో అలర్జీల శాతం తగ్గిపోయిందట. కాబట్టి పల్లీలు పడవు అని తినకుండా ఉండేవాళ్లు ఇలా ఉడికించినవి తినడంద్వారా వాటిని శరీరానికి అలవాటు చేయొచ్చు అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..