సెకండ్ ఒపీనియన్ కావాలా..?
కంటి సమస్యలుంటే నేత్ర వైద్యుడిని సంప్రదించడం... కీళ్లనొప్పులకు ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరకు వెళ్లడం... గుండెలో అసౌకర్యంగా ఉందనిపించినప్పుడు కార్డియాలజిస్టును కలవడం అందరూ చేసేదే. మరి సెకండ్ ఒపీనియన్ కావాలంటే... ఏముందీ ఇంకో డాక్టర్‌ని వెతుక్కోవడమే అంటారేమో. ఆ కష్టాన్ని తగ్గించేస్తూ... కొన్ని ఆసుపత్రులూ, సంస్థలూ ప్రత్యేకంగా సెకండ్ ఒపీనియన్ సేవల్ని అందుబాటులోకి తెచ్చాయిప్పుడు. ఒక రోగికి ఉన్న సందేహాలన్నింటినీ తీర్చి సరైన పరిష్కారాల్నీ, ప్రత్యామ్నాయ మార్గాల్నీ సూచిస్తాయివి.
ఏదయినా అనారోగ్య సమస్యతో డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు... పరీక్షలన్నీ చేశాక మందులు రాసిస్తారు. లేదంటే.. వాటిని వాడుతూనే అదనంగా కొన్ని పరీక్షల్ని చేయించుకోమని చెప్పొచ్చు. ఒకవేళ సమస్య కాస్త పెద్దదయితే రిపోర్టులను బట్టి తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సి రావచ్చని అంటారు. డాక్టర్ చెప్పినట్లుగా మందులు వేసుకునేందుకు రోగులు సుముఖంగానే ఉంటారు. కానీ పరీక్షలూ, అపరేషన్ అనేసరికే భయపడిపోతారు. డబ్బుల ఏర్పాటు నుంచి... ఇంటి పరిస్థితుల వరకూ ఎన్నో చూసుకోవాలంటూ ఆందోళన చెందుతారు. అదిగో అప్పుడే... సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే అనే కోణంలో ఆలోచిస్తారు. దానికితోడు స్నేహితులూ బంధువులూ కూడా ఫలానా ఆసుపత్రికి వెళ్లమనడం, తమకు తెలిసిన డాక్టర్ పేరును చెప్పడం... ఆపరేషన్ అక్కర్లేదు మందులతోనే నయమైపోతుందనడం... ఇలా ఒకటి కాదు రకరకాల సలహాలు ఇవ్వడం తెలిసిందే. పైగా ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆసుపత్రులూ ఎక్కువే. డాక్టర్ల సంఖ్యా పెరిగింది. దాంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక ఎటూ తేల్చుకోలేక సందేహాలతో రోగి సతమతమవుతాడు. ఇలాంటివాటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టేందుకే కొన్ని ఆసుపత్రులూ, వైద్య సంస్థలూ ఈ సెకండ్ ఒపీనియన్ సేవల్ని ప్రారంభించాయి.
ఎలా పనిచేస్తాయంటే...
కొన్ని అనారోగ్యాలకు ఆపరేషన్ తప్పనిసరి కావచ్చు. ఆ ఆపరేషన్ ఖర్చు కూడా లక్షల్లో ఉండొచ్చు. ఎన్ని పరీక్షలు చేయించుకుంటున్నా, ఎన్ని మందులు వాడుతున్నా కొందరికి ఇదీ కారణం అని స్పష్టంగా తెలియకపోవచ్చు. ఏదయినా ఆపరేషన్‌కు ప్రత్యామ్నాయ చికిత్సల గురించి తెలుసుకోవాలనుకోవచ్చు... ఎన్ని ఆసుపత్రుల చుట్టు తిరిగినా పిల్లలు కలగకపోవచ్చు. ఇలాంటి విషయాల్లో రోగులకు ఎదురయ్యే సందేహాలన్నీ తీర్చేస్తాయి ఈ సెకండ్ ఒపీనియన్ సేవలు. నిజానికి సెకండ్ ఒపీనియన్ అంటే.. నిపుణుడైన డాక్టర్ సలహాను తీసుకోవడమే కాబట్టి.. ఇలాంటి సేవలు అందించే వైద్యులంతా ఆయా రంగాలకు చెందిన ప్రముఖులే ఉంటారు. ఉదాహరణకు ‘ఎక్స్-ఎయిమ్స్ డాక్టర్స్’ అలాంటిదే. వీడియోకాల్ లేదా ఫోనులోనే రోగుల సందేహాలను నివృత్తి చేసే ఈ డాక్టర్లంతా ఒకప్పుడు ఎయిమ్స్‌లో పనిచేసిన ప్రముఖ డాక్టర్లే కావడం విశేషం. కొంత ఫీజును తీసుకుని రోగులకు సంబంధించిన ప్రతి సందేహాన్నీ తీరుస్తారు ఈ డాక్టర్లు. ఇక... హైదరాబాద్‌లోని మల్లారెడ్డినారాయణా ఆసుపత్రి కూడా ఇలా సెకండ్ ఒపీనియన్‌కు వచ్చే రోగుల సందేహాలకు సమాధానాలు ఇస్తుంది. అయితే కేవలం మొదటిసారి మాత్రమే డాక్టర్లను ఉచితంగా సంప్రదించొచ్చు. రెండోసారి వస్తే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా మెడికొవర్ ఆసుపత్రి సైతం కొన్నింటికి ఉచితంగా, మరికొన్నింటికి ఫీజు తీసుకునీ ఈ సేవల్ని అందిస్తోంది. యశోదా ఆసుపత్రిలోనూ రోగి సంబంధికులువచ్చి... రిపోర్టులను చూపించి చికిత్సకు సంబంధించిన సందేహాలను డాక్టరుతో ఉచితంగానే నివృత్తి చేసుకోవచ్చు. రోగిని తీసుకొస్తే గనుక ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఇవి కాకుండా కేర్, మ్యాక్స్ హెల్త్‌కేర్, ఎంజిఎంహెల్త్‌కేర్ సెంటర్ వంటి ఆసుపత్రుల్నీ నేరుగా లేదా ఆన్‌లైన్‌లోనూ సంప్రదించొచ్చు. అలాగే ఆస్క్ సెకండ్ ఒపీనియన్, సెకండ్ మెడిక్ డాట్‌కామ్, మెడికో ఎక్స్‌పర్ట్స్... తదితర అంకుర సంస్థలూ కొంత ఫీజు తీసుకుని సేవలు
అందిస్తున్నాయి. వీళ్లతో చికిత్సకు సంబంధించిన సందేహాలు మొదలు ఆపరేషన్ ఖర్చుల వరకూ ఎలాంటి విషయాన్నైనా నిస్సంకోచంగా చర్చించవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Rains: వచ్చే మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
-
Politics News
Andhra News: మండలిలో మారనున్న బలాబలాలు
-
Ap-top-news News
Justice Battu Devanand : జస్టిస్ బట్టు దేవానంద్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ
-
Politics News
Ganta Srinivasa Rao: ఫైనల్స్‌లో వైకాపా ఉండదు
-
Politics News
Kola Guruvulu: కోలా గురువులుకు మళ్లీ నిరాశే
-
Ap-top-news News
Botsa Satyanarayana: నాకు 2 మార్కులే ఇస్తామన్నారుగా: మంత్రి బొత్స