దండాలయ్య... ఉండ్రాళ్ళయ్యా!

గణనాధుడు జ్ఞానానికి ప్రతినిధి. వివేకానికి ప్రతీక. ఏనుగు తల నుంచి ఎలుక వాహనం దాకా... అంగాంగమూ అమూల్యమైన పాఠమే.

Updated : 16 Sep 2023 23:57 IST

గణనాధుడు జ్ఞానానికి ప్రతినిధి. వివేకానికి ప్రతీక. ఏనుగు తల నుంచి ఎలుక వాహనం దాకా... అంగాంగమూ అమూల్యమైన పాఠమే. గుమ్మడి కాయంత తల... గొప్పగా ఆలోచించమని చెబుతుంది. చాటంత చెవులు... శ్రద్ధగా వినమంటాయి. బుల్లినోరు... వీలైనంత తక్కువగా మాట్లాడమంటుంది. చిన్నికళ్లు... సూటిగా లక్ష్యానికే గురి పెట్టమంటాయి. బానపొట్ట... సుదీర్ఘ జీవితానుభవాల్ని తలపిస్తుంది. ఇక చిట్టెలుక... మనిషిలోని చంచల స్వభావానికి చిహ్నం. అహాల్నీ అత్యాశల్నీ ఎప్పుడూ నెత్తిన ఎక్కించుకోకూడదు. నిగ్రహశక్తితో వాటిని ఓడించాలి.  బతుకంటే... మంచిచెడులూ కష్టసుఖాలూ ఆనంద విషాదాలూ. అన్నింటినీ స్థితప్రజ్ఞతతో జీర్ణించుకోమని ప్రతీకాత్మకంగా బోధిస్తున్నాడు లంబోదరుడు. గణేష్‌ నవరాత్రుల్లో... రోజుకో మంచి గుణాన్ని అన్వయించుకున్నా చాలు. తొమ్మిదోరోజు మనలోని చెడునంతా నిమజ్జనం చేయవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు