రక్తాన్ని గడ్డకట్టించే నీడిల్‌ ప్యాచ్‌లు!

శరీరంలోకి నేరుగా మందును ఇంజెక్టు చేసేందుకు నొప్పి కలిగించని మైక్రో నీడిల్‌ ప్యాచ్‌లను తీసుకొచ్చారు. ఇంజెక్షన్‌కు బదులుగా ఈ ప్యాచ్‌ను అతికించడం వల్ల మందు నేరుగా చర్మకణాల్లోనుంచి రక్తంలో కలుస్తుంది.

Published : 05 Feb 2023 00:10 IST

రక్తాన్ని గడ్డకట్టించే నీడిల్‌ ప్యాచ్‌లు!

రీరంలోకి నేరుగా మందును ఇంజెక్టు చేసేందుకు నొప్పి కలిగించని మైక్రో నీడిల్‌ ప్యాచ్‌లను తీసుకొచ్చారు. ఇంజెక్షన్‌కు బదులుగా ఈ ప్యాచ్‌ను అతికించడం వల్ల మందు నేరుగా చర్మకణాల్లోనుంచి రక్తంలో కలుస్తుంది. అయితే ఇప్పుడు అదే ప్యాచ్‌ను బ్యాండేజికి బదులుగా కూడా వాడొచ్చట. అదెలా అంటే- సన్నని నీడిల్స్‌తో ఉండే ఈ ప్యాచ్‌ను చర్మంమీద అతికించడంవల్ల అవి చర్మకణాల మధ్య ఉన్న ద్రవాల్లోకి చొచ్చుకువెళ్లి మందును విడుదల చేయడం ద్వారా గాయాల నుంచి రక్తం కారకుండా చేస్తాయని చెబుతున్నారు పెన్సిల్వేన్వియా స్టేట్‌ యూనివర్సిటీ నిపుణులు. ఇందుకోసం ఈ ప్యాచ్‌ సూదుల్ని జెలాటిన్‌ మెథాక్రిలాయల్‌, సిలికేట్‌ నానోప్లేట్‌లెట్స్‌తో తయారుచేశారట. దాంతో నీడిల్స్‌తో పాటుగా ఆ మందు గాయమైన చర్మకణాల్లోకి వెళ్లి రక్తాన్ని గడ్డకట్టిస్తుంది. కాబట్టి ఈ ప్యాచ్‌ను నేరుగా అతికిస్తే గాయం త్వరగా మానిపోతుంది. దీన్ని ఎలుకల్లో పరిశీలించినప్పుడు- పదకొండున్నర నిమిషాలకు గడ్డకట్టే రక్తం కాస్తా నిమిషంలోనే ఆగిందట. కాబట్టి సంప్రదాయ డ్రెస్సింగ్‌తో పోలిస్తే మైక్రోనీడిల్‌ ప్యాచ్‌లే బెటర్‌ అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..