మొక్కలకు మొక్కలే మందు!

క్రిమికీటక సంహారిణులు ఎక్కువగా వాడటం వల్ల ఆయా పురుగులూ కీటకాలే కాదు, పర్యావరణానికీ వ్యవసాయానికీ ఎంతో అవసరమైన తేనెటీగలు కూడా చనిపోతున్నాయి.

Published : 05 Feb 2023 00:12 IST

మొక్కలకు మొక్కలే మందు!

క్రిమికీటక సంహారిణులు ఎక్కువగా వాడటం వల్ల ఆయా పురుగులూ కీటకాలే కాదు, పర్యావరణానికీ వ్యవసాయానికీ ఎంతో అవసరమైన తేనెటీగలు కూడా చనిపోతున్నాయి. ఆ కారణంతోనే ఎరువులే కాదు, పురుగుమందుల్ని సైతం సేంద్రియమైనవే వాడమంటున్నారు నిపుణులు. ఉదాహరణకు మహాగని, సిట్రస్‌ జాతులకు చెందిన మొక్కల్లో లిమనాయిడ్స్‌ అనే కర్బన రసాయనాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఇవి మొక్కల్ని కీటకాల నుంచి రక్షిస్తాయి. అదేసమయంలో తేనెటీగలకు ఎలాంటి హానీ కలిగించవు. అయితే వీటినుంచి ఆ లిమనాయిడ్లను భారీ మొత్తంలో సేకరించడం ఖర్చుతో కూడుకున్నపని. అందుకే  బ్రిటన్‌లోని జాన్‌ ఇనెస్‌ సెంటర్‌కు చెందిన నిపుణులు అజాడిరోన్‌ అనే లిమనాయిడ్‌ను ఉత్పత్తి చేసే చైనాబెర్రీ(మెలియా అజెడరక్‌) మొక్కను గుర్తించారు. ఆపై దీని జన్యుక్రమాన్ని మరో రకం లిమనాయిడ్‌ను ఉత్పత్తిచేసే పొగాకు కుటుంబానికి చెందిన మొక్కలో ప్రవేశపెట్టారు. దాంతో పొగాకు మొక్క నుంచి రెండు రకాల లిమనాయిడ్లనూ భారీ మొత్తంలో తక్కువ ధరలో తేలికగా తయారుచేసుకోవచ్చని చెబుతున్నారు. సో, ఈ పద్ధతి ద్వారా మున్ముందు సేంద్రియ కీటకసంహారిణుల్ని పెద్దయెత్తున రూపొందించవచ్చన్నమాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..