తినకుండా ఎందుకు ఉండలేకపోతున్నారంటే..!

కొంతమంది ముందు పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా... వద్దు అనుకుంటే కనీసం వాటివైపు కూడా చూడరు. కానీ చాలామంది తినొద్దు అనుకుంటూనే తింటూ ఉంటారు.

Published : 05 Feb 2023 00:14 IST

తినకుండా ఎందుకు ఉండలేకపోతున్నారంటే..!

కొంతమంది ముందు పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా... వద్దు అనుకుంటే కనీసం వాటివైపు కూడా చూడరు. కానీ చాలామంది తినొద్దు అనుకుంటూనే తింటూ ఉంటారు. దీనికి కారణం ఏమిటాని పరిశోధించారు ఒసాకా మెట్రొపాలిటన్‌ విశ్వవిద్యాలయ నిపుణులు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచదేశాలన్నీ ఎదుర్కొంటోన్న అతిపెద్ద సమస్య ఊబకాయం. దీనివల్ల హృద్రోగాలు, పక్షవాతం, క్యాన్సర్లు... ఇలా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. దాంతో డైటీషియన్ల సలహా మేరకు చాలామంది ఆహారంలో మార్పుచేర్పులు చేసుకుంటూ బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండటం లేదు. కొద్దిరోజులపాటు నియమిత ఆహారాన్ని తిన్నా శరీరం కొన్నాళ్లకి మళ్లీ మొదటికే వస్తుంది. దీనికి కారణం మెదడులోని ఇన్ఫీరియర్‌ ఫ్రాంటల్‌ గైరస్‌లో జరిగే రసాయన చర్యలేనట. అదెలా అంటే- ఆహారానికి సంబంధించిన ఫొటోల్నిగానీ లేదా నేరుగా ఆహారాన్నిగానీ చూసినప్పుడు సంబంధిత వ్యక్తి ప్రమేయం లేకుండానే ఆ భాగం ఉత్తేజితమవుతున్నట్లు గమనించారు. అంతేకాదు, భావోద్వేగాలూ తినడానికి కారణమవుతున్నాయట. కాబట్టి ఆహారపుటలవాట్లను అర్థం చేసుకోవాలంటే సంకల్పిత, అసంకల్పిత... ఇలా రెండు దశల్లోనూ మెదడు పనితీరుని నిశితంగా గమనించాలని పేర్కొంటున్నారు. అయితే అసంకల్పితంగా జరిగే ఆ చర్యను నిరోధించాలంటే... మెదడుకు వద్దు వద్దు అన్న సంకేతాల్ని పదే పదే పంపించడం ద్వారా కొంతవరకూ నియంత్రణ సాధించవచ్చు అని చెప్పుకొస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..