కుంగుబాటుకి లోనయితే..!

సామాజికంగానూ ఆర్థికపరంగానూ వెనకబడటంవల్లో లేదా కుటుంబ కలహాలూ వృద్ధాప్యంవల్లో కొంతమంది కుంగుబాటుకు లోనవుతారు. అలాగే ఆనువంశికంగా వచ్చే జన్యువులవల్ల కూడా కొందరు తీవ్రమైన కుంగుబాటుకు గురవుతుంటారు.

Published : 25 Mar 2023 23:38 IST

కుంగుబాటుకి లోనయితే..!

సామాజికంగానూ ఆర్థికపరంగానూ వెనకబడటంవల్లో లేదా కుటుంబ కలహాలూ వృద్ధాప్యంవల్లో కొంతమంది కుంగుబాటుకు లోనవుతారు. అలాగే ఆనువంశికంగా వచ్చే జన్యువులవల్ల కూడా కొందరు తీవ్రమైన కుంగుబాటుకు గురవుతుంటారు. ఆ సమయంలో వాళ్లకు ధైర్యాన్నిస్తూ సన్నిహితులు అండగా ఉంటే అందులోనుంచి బయటకు రాగలుగుతారు. వీళ్లందరితో పోలిస్తే సామాజికంగా దెబ్బతిన్న వైద్యులూ భర్తను కోల్పోయిన మహిళల్లో డిప్రెషన్‌ పాళ్లు మరింత ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల చేసిన ఓ అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా మెడిసిన్‌ చదివే విద్యార్థుల్లో ఇంటర్న్‌షిప్‌ చేసేటప్పుడు- విపరీతమైన ఒత్తిడీ ఆందోళనా నెలకొంటాయనీ ఆ సమయంలో వాళ్లకి సామాజికంగా ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారనీ చెబుతున్నారు. కాబట్టి అలాంటప్పుడు ఇంటాబయటా ఎవరైనా అండగా ఉంటే వాళ్లు అంతే త్వరగా దాన్నుంచి కోలుకుంటారని చెప్పుకొస్తున్నారు మిషిగన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు