ఆయుష్షునూ పెంచొచ్చు!

ఎవరైనా సరే ఎక్కువకాలం జీవించాలనే కోరుకుంటారు. కానీ తరుముకొచ్చే వృద్ధాప్యాన్ని ఎవరూ ఆపలేరు. అందుకే వయసు మీదపడనీయని ఎంజైమ్‌ను గుర్తించి దాన్ని పెంపొందించగలిగితే ఇక జీవితానికి ఢోకా ఏముంటుంది అనుకున్నట్లున్నారు వర్జీనియా యూనివర్సిటీ పరిశీలకులు.

Published : 25 Mar 2023 23:40 IST

ఆయుష్షునూ పెంచొచ్చు!

వరైనా సరే ఎక్కువకాలం జీవించాలనే కోరుకుంటారు. కానీ తరుముకొచ్చే వృద్ధాప్యాన్ని ఎవరూ ఆపలేరు. అందుకే వయసు మీదపడనీయని ఎంజైమ్‌ను గుర్తించి దాన్ని పెంపొందించగలిగితే ఇక జీవితానికి ఢోకా ఏముంటుంది అనుకున్నట్లున్నారు వర్జీనియా యూనివర్సిటీ పరిశీలకులు. ఆ దిశగా పరిశోధన చేపట్టారు. అందులో డిహైడ్రోజినేజ్‌ అనే పదార్థం శరీరంలో పేరుకున్న హానికర వ్యర్థాలను తొలగించి ఆయుష్షు పెరిగేలా చేస్తుందని గుర్తించారు. ఏడీహెచ్‌-1 అనే జన్యువును యాక్టివేట్‌ చేసినప్పుడు ఉత్పత్తి అయిన డిహైడ్రొజినేజ్‌ అనే ఎంజైమ్‌ హానికర గ్లిజరాల్‌, గ్లిజరాల్డిహైడ్‌... వంటి ఉత్పత్తుల్ని అడ్డుకున్నట్లు గుర్తించారు. నేలలోపల నివసించే వానపాముల్లో ఈ విషయాన్ని పరిశీలించినప్పుడు వాటి ఆయుష్షు సగానికి పైగా పెరిగిందట. అదీగాక, మితాహారంతో దీర్ఘకాలం జీవించవచ్చని పరిశీలనలూ చెబుతున్నాయి. దాంతో మనుషులతోపాటు ఎలుకలు, కోతులు, పందులకి మితాహారం ఇచ్చి, జన్యువుల్ని పరిశీలించినప్పుడు- అన్నింటిలోనూ ఏడీహెచ్‌-1 జన్యువు చురుగ్గా మారి, ఈ ఎంజైమ్‌ను ఉత్పత్తి చేసినట్లు గుర్తించారు. దీన్నిబట్టి ఆ జన్యువును కృత్రిమ పద్ధతుల్లోనైనా చురుకుగా మార్చగలిగితే వృద్ధాప్యాన్ని కొంతవరకూ అడ్డుకోవచ్చన్నది నిపుణుల అభిప్రాయం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..