కెఫీన్‌ మంచిదేనా?

కాఫీ, టీల్లోని కెఫీన్‌ ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయమ్మీద ఇప్పటికే ఎన్నో రకాల పరిశీలనలు వచ్చాయి. అయితే అది గుండెకు మంచిదని కొన్నిసార్లూ కాదని మరోసారీ చెప్పుకుంటూ వస్తున్నారు.

Published : 25 Mar 2023 23:42 IST

కెఫీన్‌ మంచిదేనా?

కాఫీ, టీల్లోని కెఫీన్‌ ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయమ్మీద ఇప్పటికే ఎన్నో రకాల పరిశీలనలు వచ్చాయి. అయితే అది గుండెకు మంచిదని కొన్నిసార్లూ కాదని మరోసారీ చెప్పుకుంటూ వస్తున్నారు. లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌, బ్రిస్టల్‌ యూనివర్సిటీలు తాజాగా కెఫీన్‌ జీవక్రియకు సంబంధించిన జన్యువుల పనితీరు మీద దృష్టి సారించాయి. అందులో రక్తంలోని కెఫీన్‌ మధుమేహం, హృద్రోగాలతోపాటు కొవ్వు శాతాన్ని తగ్గిస్తున్నట్లు గుర్తించగలిగారు. ఎందుకంటే ఆయా జన్యువులు రక్తంలోని కెఫీన్‌ను నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేస్తాయట. దాంతో ఎక్కువసేపు రక్తంలో కెఫీన్‌ ఉండటం వల్ల బరువు తగ్గడంతోపాటు మధుమేహం, హృద్రోగాల ప్రమాదం కూడా తగ్గుతున్నట్లు గుర్తించారు. అయితే ఈ విషయమై వీళ్లు మరింత నిశితంగా పరిశోధన చేయాలని కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తమ్మీద కెఫీన్‌ వల్ల పెద్ద ప్రమాదం లేదని మాత్రం స్పష్టం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు