ఆలోచనల్ని రాసిపెడుతుంది...

ఏఐతో మన జీవన విధానమే మారుతోంది. అందుకు మరో ఉదాహరణ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ పరిశోధకులు తెస్తోన్న ‘సెమాంటిక్‌ డికోడర్‌’.

Updated : 21 May 2023 04:25 IST

ఐతో మన జీవన విధానమే మారుతోంది. అందుకు మరో ఉదాహరణ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ పరిశోధకులు తెస్తోన్న ‘సెమాంటిక్‌ డికోడర్‌’. చాట్‌జీపీటీ తరహాలో ఓపెన్‌ ఏఐ విధానంలోనే ఇది పనిచేస్తుంది. ఒక వ్యక్తి ఏదైనా కథని వింటున్నప్పుడు, లేదంటే మెదడులో ఒక కథని ఊహించినప్పుడు మెదడులోని కదలికల్ని అనుసరించి దానికి అక్షరరూపం ఇస్తుంది. దీనివల్ల పక్షవాతం లాంటి సమస్యలతో మాటని కోల్పోయినవారి ఆలోచనల్ని తెలుసుకునేందుకు వీలు పడుతుందంటున్నారు పరిశోధకులు. ఇప్పటివరకూ అభివృద్ధిలో ఉన్న ఇలాంటి పరికరాల్ని వ్యక్తి మెదడు భాగంలో ఏదైనా భౌతిక పరికరంతో అనుసంధానిస్తూ వస్తున్నారు. ఈ విధానంలో ఆ అవసరం ఉండదు. నిర్దేశిత పదాలకే పరిమితం కావాల్సిన అవసరమూ లేదు. దీన్లో ఎఫ్‌ఎమ్‌ఆర్‌ఐని ఉపయోగించి మెదడు పనితీరుని గమనిస్తారు. ఈ ప్రక్రియలో సదరు వ్యక్తికి ముందుగా కొన్ని గంటలపాటు ఈ స్కానర్‌లో పాడ్‌కాస్ట్స్‌ వినిపిస్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తి కొత్త కథ వింటున్నప్పుడూ, ఓ కథని ఊహించినప్పుడూ ఈ మెషీన్‌ వాటిని అక్షర రూపంలోకి మార్చుతుంది. ప్రతి పదమూ ఉన్నదున్నట్లు కాకపోయినా, అత్యంత దగ్గరగా ఆ కథని వినిపిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు