ఆ తీపితోనూ గుండెకు చేటే!

ఒకప్పుడు మధుమేహం ఉన్నవాళ్ళు మాత్రమే ‘షుగర్‌ ఫ్రీ’ స్వీట్ల వైపు వెళ్ళేవారు. ఇప్పుడు ఏ ఆరోగ్య సమస్య లేకున్నా ఫిట్‌నెస్‌ కోసమంటూ వాటిని వాడేస్తున్నారు.

Published : 16 Jun 2024 00:57 IST

ఒకప్పుడు మధుమేహం ఉన్నవాళ్ళు మాత్రమే ‘షుగర్‌ ఫ్రీ’ స్వీట్ల వైపు వెళ్ళేవారు. ఇప్పుడు ఏ ఆరోగ్య సమస్య లేకున్నా ఫిట్‌నెస్‌ కోసమంటూ వాటిని వాడేస్తున్నారు. అయితే, వైద్యుల సలహా లేనిదే వాటివైపు వెళ్ళొద్దంటున్నారు పరిశోధకులు. ఎరిథ్రిటాల్‌, సుక్రలోజ్‌, జినిటాల్‌... మనం వాడుతున్న ‘షుగర్‌లెస్‌’ పదార్థాల్లో ఉపయోగించే ప్రధాన రసాయనాలు ఇవే. గత ఏడాది ‘ఎరిథ్రిటాల్‌’ వాడకానికీ హృద్రోగ సమస్యకీ సంబంధం ఉందని తేల్చారు శాస్త్రవేత్తలు. సుక్రలోజ్‌ అల్సర్‌ వంటి ఉదర సమస్యలకి దారితీస్తోందని ఈ ఏడాది ప్రారంభంలోనే తేల్చారు. ఇప్పుడు జినిటాల్‌ వంతు! దాన్ని స్వీటెనర్‌గా ఉపయోగిస్తున్న సుమారు 3300 మందిని ఈ పరిశోధనకు ఎంచుకున్నారు అమెరికాలోని ఒహాయో వర్సిటీ శాస్త్రవేత్తలు. ఎప్పటికప్పుడు వాళ్ళ రక్తంలోని జినిటాల్‌ శాతాన్ని అంచనావేస్తూ వచ్చారు. మూడేళ్ళ తర్వాత చూస్తే- రక్తంలో మామూలుకన్నా జినిటాల్‌ శాతం ఎక్కువగా ఉన్నవారిలో గుండెపోటు ఏర్పడటాన్ని గమనించారు. అవి రక్తంలోని ప్లేట్‌లెట్‌లని గడ్డకట్టేలా చేస్తుండటమే ఇందుకు కారణమని తేల్చారు. కాబట్టి, నడివయసు దాటినవాళ్ళు స్వీటెనర్‌ల మోతాదు విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..