ఆ ఆహారంతో అతివలకి దీర్ఘాయుష్షు!

‘ప్రపంచంలో ది బెస్ట్‌ ఆహార విధానమేదీ?’ అని ప్రశ్నిస్తే ‘మెడిటెరేనియన్‌ ఫుడ్డే’ అనేస్తున్నారు ఇప్పుడు ఏ ఆహార నిపుణులైనా. ఆ ఆహారం మగవాళ్ళందరికీ అందించే మేలుని అటుంచితే- ఆడవాళ్ళ విషయంలో నిజంగా అద్భుతమే చేస్తుందని చెబుతోంది తాజా పరిశోధన ఒకటి.

Published : 16 Jun 2024 01:02 IST

‘ప్రపంచంలో ది బెస్ట్‌ ఆహార విధానమేదీ?’ అని ప్రశ్నిస్తే ‘మెడిటెరేనియన్‌ ఫుడ్డే’ అనేస్తున్నారు ఇప్పుడు ఏ ఆహార నిపుణులైనా. ఆ ఆహారం మగవాళ్ళందరికీ అందించే మేలుని అటుంచితే- ఆడవాళ్ళ విషయంలో నిజంగా అద్భుతమే చేస్తుందని చెబుతోంది తాజా పరిశోధన ఒకటి. హృద్రోగం, క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులొచ్చే ప్రమాదాన్ని కూడా 23 శాతం తగ్గిస్తోందని అంటోంది. రోజువారీ ఆహారంలో పండ్లూ కాయగూరలూ, ధాన్యాలూ, గింజల్ని తీసుకోవడమూ... చేపలకీ, గుడ్లకీ ప్రాధాన్యం ఇవ్వడమూ... వంటల్లో ఆలివ్‌ నూనెనే ప్రధానంగా వాడటమూ... ఎప్పుడోకానీ మటన్‌లాంటివాటిని ముట్టకపోవడమూ... క్లుప్తంగా ఇదే మెడిటెరేనియన్‌ ఆహార విధానమంటే. కచ్చితంగా ఇలాగే ఉండాలని లేదు- దీనికి కాస్త దగ్గరగా ఉన్న ఆహారాన్ని తీసుకున్నా సరే మహిళల ఆరోగ్యాల్లో చక్కటి మార్పులు వచ్చాయంటున్నారు ఈ పరిశోధకులు. అమెరికాలోని బ్రిగమ్‌ అండ్‌ విమెన్స్‌ హాస్పిటల్‌ శాస్త్రవేత్తలు ఇందుకోసం 25 వేల మంది స్త్రీలని... పాతికేళ్ళపాటు పరిశోధించారు. వాళ్ళలో- ఈ ఆహారాన్ని తీసుకుంటున్నవారిలో జీవక్రియ (మెటబాలిజం) రేటు చక్కగా ఉండటం, నడివయసు దాటినా సహజ ఇన్సులిన్‌ తగ్గకపోవడం, చెడు కొవ్వు పెరగకపోవడం చూశామంటున్నారు. ఆ కారణంగానే ప్రాణాంతక వ్యాధులు వాళ్ళ దరికి రాలేదని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..