ఇంటికాలుష్యం... ఇక హుష్‌ కాకి!

కాలుష్యం ఇప్పుడు బయట కాదు... ఇంట్లోనే తిష్ఠ వేస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. గ్యాస్‌ స్టవ్‌, ఫర్నిచర్‌, కార్పెట్‌, ఎయిర్‌ కండిషనర్‌, ఫ్రిజ్‌, పెయింట్లు... ఇవన్నీ కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని చెబుతున్నారు

Published : 16 Jun 2024 01:04 IST

కాలుష్యం ఇప్పుడు బయట కాదు... ఇంట్లోనే తిష్ఠ వేస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. గ్యాస్‌ స్టవ్‌, ఫర్నిచర్‌, కార్పెట్‌, ఎయిర్‌ కండిషనర్‌, ఫ్రిజ్‌, పెయింట్లు... ఇవన్నీ కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని చెబుతున్నారు. కొన్ని నగరాల్లోనైతే బయటికన్నా ఇంట్లో ఐదు రెట్లు ఎక్కువగా కాలుష్యం ఉంటోందట. జలుబూ దగ్గుల నుంచీ ఉబ్బసం దాకా పలు సమస్యలకి ఇది దారితీస్తోందట. వీటికి విరుగుడుగా కొందరు ఇళ్ళలోనే ఎయిర్‌ ప్యూరిఫయర్‌లు కొంటున్నారు కానీ... ఓ చిన్న మొక్కనే అలా ఎయిర్‌ ప్యూరిఫయర్‌గా మారిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది యూనివర్సిటీ ఆఫ్‌ ప్యారిస్‌కి చెందిన పరిశోధకులకి. ఇందుకోసం ఓ మనీప్లాంట్‌ని ఎంచుకుని దానికి జన్యుమార్పు చేశారు. మనకి మంచి చేసే బ్యాక్టీరియాకి ఆశ్రయమిచ్చేలా ఆ మొక్కని మార్చారు. ఆ బ్యాక్టీరియా- గాలిలోని కాలుష్య కారకాల్ని తింటూనే బతుకుతాయట. అలా- మామూలు మొక్కకన్నా వెయ్యిరెట్లు ఎక్కువగా కాలుష్యాన్ని పీల్చి గాలిని శుభ్రం చేస్తాయన్నమాట. ప్యారిస్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ మొక్కని ఆవిష్కరించడంతోనే ఊరుకోలేదు... దానితో నియోప్లాంట్స్‌ అనే స్టార్టప్‌ని పెట్టి అలాంటి మొక్కల్ని విక్రయిస్తున్నారు కూడా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..