నత్తి రహస్యం తెలిసింది!

ప్రపంచంలోని ఆరుశాతం పిల్లలూ, ఒక్క శాతం పెద్దల్లోనూ నత్తి ఉంటుందట. మాట్లాడేటప్పుడు మెదడు అనవసరమైన ఆతృతకి గురికావడమే ఇందుకు కారణమని వైద్యులు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు.

Published : 16 Jun 2024 01:07 IST

ప్రపంచంలోని ఆరుశాతం పిల్లలూ, ఒక్క శాతం పెద్దల్లోనూ నత్తి ఉంటుందట. మాట్లాడేటప్పుడు మెదడు అనవసరమైన ఆతృతకి గురికావడమే ఇందుకు కారణమని వైద్యులు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. అయినా మెదడులో ఏ భాగంలో ఈ సమస్య ఏర్పడుతుందో పసిగట్టలేకపోయారు. తాజాగా ఆ భాగమేదో కనిపెట్టారు ఫిన్‌లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ తుర్కు శాస్త్రవేత్తలు. మన మెదడులో ఆవేశాలని అదుపు చేసేందుకు ‘అమిగ్దలా’ అనీ, కదలికల్ని నియంత్రించేందుకు ‘పుటేమన్‌’ అనీ, మనకొచ్చే భిన్న సమాచారాల్ని విశ్లేషించేందుకు ‘క్లాస్ట్రమ్‌’ అనీ... మూడు విభాగాలుంటాయి. ఆ మూడింటినీ కలిపే న్యూరాన్‌ల విభాగం కూడా ఒకటుందట. ఆ భాగంలోని మెదడు కణాల్లో ఏర్పడే చిన్నపాటి అంతరాయమే నత్తికి కారణమని తాజాగా కనిపెట్టారు శాస్త్రవేత్తలు. వేలాది బ్రెయిన్‌ స్కానర్‌లని ‘ఏఐ’తో విశ్లేషించడం ద్వారా దీన్ని సాధించారట. ఈ భాగాన్ని గుర్తించడం వల్ల- అక్కడ చిన్నపాటి విద్యుత్తు ప్రేరణలు(స్టిమ్యులేషన్‌) ఇవ్వడం ద్వారా నత్తి సమస్యని అధిగమించొచ్చని చెబుతున్నారు. ఆ దిశగా చికిత్సా విధానాలనీ రూపొందిస్తున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..