పుట్టగొడుగులతో క్యాన్సర్‌కి చెక్‌?!

మనదగ్గర పెద్దగా లేదుకానీ చైనా, జపనీయుల సంప్రదాయ వైద్యంలో పుట్టగొడుగులది కీలక పాత్ర. వాటి నుంచి తీసిన ద్రవాలు వ్యాధినిరోధక శక్తిని పెంచి... క్యాన్సర్‌నీ నిలువరిస్తాయన్న నమ్మకం ఆ దేశాల్లో బాగా ఉంది.

Published : 22 Jun 2024 23:40 IST

నదగ్గర పెద్దగా లేదుకానీ చైనా, జపనీయుల సంప్రదాయ వైద్యంలో పుట్టగొడుగులది కీలక పాత్ర. వాటి నుంచి తీసిన ద్రవాలు వ్యాధినిరోధక శక్తిని పెంచి... క్యాన్సర్‌నీ నిలువరిస్తాయన్న నమ్మకం ఆ దేశాల్లో బాగా ఉంది. 2022లో భారతీయ పరిశోధకుడు ఎస్‌కే పాండాతో కలిసి బెల్జియన్‌ శాస్త్రవేత్తలు కొందరు వీటిపైన సమగ్ర అధ్యయనం ఒకటి నిర్వహించారు. ప్రపంచంలో వేల సంఖ్యలో పుట్టగొడుగులున్నా- మనం తినగలిగేవి రెండువందల రకాలు మాత్రమే. వీటిలో పుట్టగొడుగులకి క్యాన్సర్‌ నిరోధక గుణాలున్నాయని వాళ్ళు గుర్తించారు. వాటిల్లోని పాలీశాకరైడ్‌లూ, యాంటీఆక్సిడెంట్‌లూ ఆ మహమ్మారిపైన చక్కగా పోరాడగలవని తేల్చారు. ఈ అధ్యయనాన్ని మరింత ముందుకు తీసుకెళుతూ తాజా పరిశోధన ఒకటి నిర్వహించారు అమెరికాలోని పెన్సిల్వేనియా వర్సిటీ శాస్త్రవేత్తలు. ఇందుకోసం పుట్టగొడుగులు తినే అలవాటున్న సుమారు 20 వేలమంది ఆహారపుటలవాట్లని పరిశీలించారు. వాళ్ళ డేటాని విశ్లేషించి మన రోజువారీ ఆహారంలో కనీసం ఒక్క పుట్టగొడుగుని(18 గ్రాముల లెక్కన) చేర్చుకోగలిగినా క్యాన్సర్‌ ముప్పు 45 శాతం తగ్గొచ్చని ప్రకటించారు. ‘అంటే క్యాన్సర్‌ రాకుండా అడ్డుకోవడానికి ఇదొక్కటే సరిపోతుందని కాదు. రోజువారీ వ్యాయామం, మంచి ఆహారపుటలవాట్లకి పుట్టగొడు గులూ తోడైతే మంచి ఫలితం ఉంటుంది’ అని చెబుతున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు