సమస్య... బ్లూలైట్‌తో కాదు!

నిద్రకు ముందు ఫోన్‌ చూడకూడదన్నది ఎప్పటి నుంచో ఆరోగ్య నిపుణులు చెబుతున్నమాట. ముఖ్యంగా, స్మార్ట్‌ ఫోన్‌లు వెదజల్లే ‘బ్లూ లైట్‌’ మన కళ్ళని ఇబ్బందికి గురిచేసి, నిద్రకు కారణమయ్యే మెలటోనిన్‌ అనే హార్మోన్‌ని నిరోధిస్తుందంటారు.

Published : 22 Jun 2024 23:41 IST

నిద్రకు ముందు ఫోన్‌ చూడకూడదన్నది ఎప్పటి నుంచో ఆరోగ్య నిపుణులు చెబుతున్నమాట. ముఖ్యంగా, స్మార్ట్‌ ఫోన్‌లు వెదజల్లే ‘బ్లూ లైట్‌’ మన కళ్ళని ఇబ్బందికి గురిచేసి, నిద్రకు కారణమయ్యే మెలటోనిన్‌ అనే హార్మోన్‌ని నిరోధిస్తుందంటారు. ఈ నేపథ్యంలో ‘అసలు బ్లూ లైట్‌ నిజంగానే మన నిద్రపైన ప్రభావం చూపుతోందా? చూపితే ఎంత మేరకు?’ అన్న విషయాన్ని తేల్చుకోవాలని నడుంబిగించారు ఆస్ట్రేలియాకి చెందిన ఫ్లిండర్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా ఇదివరకే జరిగిన 11 సమగ్ర అధ్యయనాలని ఇందుకోసం జల్లెడపట్టారు. బ్లూలైట్‌కీ- నిద్రకీ ప్రత్యక్షంగా సంబంధం ఉందా అని తరచి చూసి... చివరికి ‘లేదు’ అనే తేల్చారు. మన నిద్రపైన దాని ప్రభావం ఏమాత్రం చెప్పుకోదగ్గది కాదని వీళ్ళు చెబుతున్నారు. ‘మరి సమస్య బ్లూలైట్‌ది కాకుంటే ఇంక దేనిది?’ అని ప్రశ్నిస్తే ‘మీరు మొబైల్‌లో చివరిగా చూడాలనుకున్న సోషల్‌ మీడియా పోస్ట్‌దీ యూట్యూబ్‌ వీడియోదీ వాట్సాప్‌ మెసేజ్‌లదీ... అవి రేపే ఆసక్తిదీ, ఆలోచనలదే ఈ పాపం’ అంటున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు