సాయంకాలం వ్యాయామమే ఉత్తమం!

మధుమేహం ఉన్నవాళ్ళకీ, భవిష్యత్తులో వచ్చే ప్రమాదం ఉందనుకున్నవాళ్ళకీ వ్యాయామం తప్పనిసరి! మరి ఆ వ్యాయామం ఎప్పుడైనా చేయొచ్చా... అంటే కాదంటున్నారు శాస్త్రవేత్తలు. సాయంత్రం వేళ చేస్తేనే మధుమేహులకి మంచిదని సూచిస్తున్నారు.

Updated : 23 Jun 2024 11:30 IST

ధుమేహం ఉన్నవాళ్ళకీ, భవిష్యత్తులో వచ్చే ప్రమాదం ఉందనుకున్నవాళ్ళకీ వ్యాయామం తప్పనిసరి! మరి ఆ వ్యాయామం ఎప్పుడైనా చేయొచ్చా... అంటే కాదంటున్నారు శాస్త్రవేత్తలు. సాయంత్రం వేళ చేస్తేనే మధుమేహులకి మంచిదని సూచిస్తున్నారు. షుగర్‌ ఉన్నవాళ్ళు వ్యాయామం ఎప్పుడు చేయాలన్నదానిపైన స్పెయిన్‌లోని గ్రనాడ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఇటీవల ఓ అధ్యయనం చేశారు. మధుమేహ బాధితులైన 186 మంది వ్యాయామ అలవాట్లని దగ్గరగా పరిశీలించారు. వ్యాయామం చేస్తున్నంతసేపూ వాళ్ళ శరీర గ్లూకోజ్‌ స్థాయుల్ని ప్రత్యేక పరికరాల ద్వారా నమోదు చేశారు. రెండువారాలపాటు అలా పరిశీలించాక ఆ వివరాలని విశ్లేషిస్తే... ఉదయం వేళకన్నా సాయంత్రాల్లో వ్యాయామం చేసేవాళ్ళలో గ్లూకోజు స్థాయులు నియంత్రణలో ఉన్నట్టు తేలింది. వ్యాయామం చేసిన ఆ రెండు గంటల వరకే కాదు...ఆ తర్వాతి రోజు కూడా గ్లూకోజు స్థాయులు పెరగకపోవడాన్ని గమనించారట. అదే ఉదయంవేళల్లో వ్యాయామాన్ని ఎంచుకున్నవారిలో గ్లూకోజ్‌ స్థాయుల్లో పెద్ద మార్పులేవీ లేవట. కాబట్టి మధుమేహ బాధితులు తమ వీలునుబట్టి సాయంత్రాల్లోనే వ్యాయామం చేయడం మంచిదని సలహా ఇస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు