ఊబకాయం మందు... అల్జీమర్స్‌కి కూడా!

సెమాగ్లుటైడ్‌... ఊబకాయులకి డాక్టర్లు సిఫార్సు చేసే మందు. పళ్ళెం నిండా ఆహారం తింటున్నవాళ్ళు...  దీన్ని వాడటం మొదలుపెడితే అందులో పావు వంతే తీసుకుంటారు.

Published : 23 Jun 2024 00:36 IST

సెమాగ్లుటైడ్‌... ఊబకాయులకి డాక్టర్లు సిఫార్సు చేసే మందు. పళ్ళెం నిండా ఆహారం తింటున్నవాళ్ళు...  దీన్ని వాడటం మొదలుపెడితే అందులో పావు వంతే తీసుకుంటారు. కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావనని కలిగిస్తుందీ మందు. ఈ ఔషధంలోని గ్లుకాగన్‌ లైక్‌ పెప్టైడ్‌-1(జీఎల్‌పీ-1) అన్న రసాయనం ఇందుకు కారణమంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దీన్ని వాడుతున్నారు ఇప్పుడు. వాళ్ళలోని 40 లక్షలమందితో తాజాగా ఓ అధ్యయనం నిర్వహించింది అమెరికాకి చెందిన ఎపిక్‌ అనే సంస్థ. వాళ్ళందరిలోనూ డిప్రెషన్‌ యాంగ్జైటీ లక్షణాలు గణనీయంగా తగ్గినట్టు నిరూపించింది. ఇంగ్లండులోని లాంకెస్టైర్‌ పరిశోధకులు మరో అడుగు ముందుకేసి అల్జీమర్స్‌, పార్కిన్సన్స్‌ డిసీజ్‌ లాంటి మెదడు సంబంధిత సమస్యలపైనా దీని ప్రభావాన్ని చూడాలనుకున్నారు. సుమారు వెయ్యిమంది బాధితులకి ఈ మందుని ఇచ్చాక- వ్యాధి ముదరకుండా ఉండటాన్ని గమనించారు. వీళ్ళ పరిశోధనలు రెండోదశ క్లినికల్‌ ప్రయోగం దాకా వచ్చాయి. ఇదేగనక విజయం సాధిస్తే- అల్జీమర్స్‌కి సమర్థ ఔషధం దొరికినట్టే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..