ఊబకాయానికి అదీ కారణమేనట

ఎక్కువ తినడం శారీరకంగా తక్కువగా శ్రమించడమే ఊబకాయం సమస్యకి మూలమని అందరూ అనుకుంటారు.

Published : 06 Jul 2024 23:39 IST

క్కువ తినడం శారీరకంగా తక్కువగా శ్రమించడమే ఊబకాయం సమస్యకి మూలమని అందరూ అనుకుంటారు. కానీ ఊబకాయులందర్నీ ఒకే గాటన కట్టేయలేమంటోంది ఈ పరిశోధన. కొందరు ఎంత కష్టపడ్డా లావు తగ్గరు- వాళ్ళ శరీరంలోని శక్తి వినియోగం కాదు. దీనికి కారణం ఏమిటని ఎంతోకాలంగా పరిశోధిస్తూ వస్తున్న లండన్‌ ఎక్సీటర్‌ వర్సిటీ పరిశోధకులు ఈ మధ్య కాస్త దారి మార్చారు. జన్యులోపం ఏమైనా ఉండొచ్చా అన్న దిశగా పరిశీలిస్తే... అదే నిజమైంది. సాధారణంగా మన శరీరంలోని శక్తి వినియోగంలో ఎస్‌ఐఎమ్‌ఐఎమ్‌-1 అనే జన్యువు కీలకపాత్ర పోషిస్తుందట. ఆ జన్యువు అసలే లేనివాళ్ళూ కొందరు ఉన్నారని ఈ పరిశోధనతో గుర్తించారు శాస్త్రవేత్తలు! ప్రతి ఐదువేల మందిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారట. ఆశ్చర్యమేమిటంటే- ఈ అరుదైన సమస్యకి అప్పుడే ఓ సులువైన పరిష్కారమూ దొరికింది. కొందరికి థైరాయిడ్‌ పనితీరు తీవ్రమై దాన్ని తగ్గించే మందులు వాడుతుంటారు. ఆ మందులు ఈ తరహా ఊబకాయుల్లో చక్కగా పని చేస్తున్నట్టు గుర్తించారు లండన్‌ శాస్త్రవేత్తలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..