తీవ్ర సమస్యల్ని పట్టించే నిద్ర?!

నడకే కాదు... ఈ మధ్య మన నిద్రని అంచనావేసే పరికరాలూ వచ్చాయి. ఏదో నిద్ర పోయామంటే పోవడం కాదు- ఆరోగ్యానికి అత్యవసరమైన గాఢనిద్ర పోతున్నామా లేదా అని కూడా ఇవి పసిగట్టగలుగుతున్నాయి.

Published : 06 Jul 2024 23:41 IST

డకే కాదు... ఈ మధ్య మన నిద్రని అంచనావేసే పరికరాలూ వచ్చాయి. ఏదో నిద్ర పోయామంటే పోవడం కాదు- ఆరోగ్యానికి అత్యవసరమైన గాఢనిద్ర పోతున్నామా లేదా అని కూడా ఇవి పసిగట్టగలుగుతున్నాయి. నిద్రకీ మనకొచ్చే వ్యాధులకీ దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి- ఈ ‘స్లీప్‌ ట్రాకర్‌’లు వాటిని ఎంతమేరకు పట్టిస్తున్నాయో చూద్దామన్న ఆలోచన వచ్చింది అమెరికన్‌ శాస్త్రవేత్తలకి. ఇందుకోసం 33 వేల మందికి చెందిన- వారి ట్రాకర్‌లలో నమోదైన -నిద్రరీతుల్ని విశ్లేషించారు. రాత్రి ఏ సమస్యా లేకుండా ఆరేడు గంటలపాటు నిద్రపోయేవారూ, మధ్యలో అంతరాయం ఏర్పడుతూ నిద్రలేచేవారూ, ఎంతసేపు పడుకున్నా కలత నిద్రే మిగిలేవారూ... ఇలా 13 రకాలుగా వీళ్ళని విభజించారు. ఏ మనిషీ ఎప్పుడూ ఒకే రకం నిద్రలో కాకుండా మిగతా రకాలకూ మారుతుంటాడన్న విషయాన్నీ గుర్తించారు. ఉదాహరణకు- ఆరేడు గంటలు నిద్రపోయే వ్యక్తి అనుకోకుండా నాలుగు గంటల నిద్ర విభాగంలోకి రావొచ్చట. కానీ ‘ఈ మార్పు తరచూ జరగకూడదు. అలా జరగడం అన్నది మీరు ఏదో వ్యాధికి గురవుతున్నారు అనడానికి ఓ సూచిక’ అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఆ సూచికల ద్వారా మధుమేహం, స్లీప్‌ ఆప్నియా వంటి దీర్ఘకాలిక సమస్యల్నీ డెంగ్యూ వంటి ఇన్ఫెక్షన్‌లనీ కూడా అంచనా వేయొచ్చంటున్నారు. కనక, మామూలు వ్యాధి నిర్ధారణ పద్ధతులకి అదనంగా నిద్రకి సంబంధించిన ఈ ట్రాకర్లని కూడా వైద్యులు పరిగణనలోకి తీసుకోవచ్చని చెబుతున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు