‘ఒంటరి’ భావన... ప్రమాదమే

వృద్ధాప్యం అన్నది ఒంటరితనానికి పర్యాయపదంగా మారుతోంది ఇప్పుడు.

Published : 06 Jul 2024 23:43 IST

వృద్ధాప్యం అన్నది ఒంటరితనానికి పర్యాయపదంగా మారుతోంది ఇప్పుడు. పిల్లలు ఏ విదేశాల్లోనో స్థిరపడటంతో తల్లిదండ్రులు ఏకాకిగా బతకడం మాత్రమే కాదు  చుట్టూ అందరూ ఉన్నా తనకెవరూ ఆత్మీయులు లేరన్న భావన కూడా ఒంటరితనమే. ఈ తరహా బాధని సుదీర్ఘకాలం అనుభవించేవాళ్ళలో పక్షవాతం, గుండెపోటు సమస్యలు పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇందుకోసం 12 వేల మంది వృద్ధుల్ని పరిశీలించారు హార్వర్డ్‌ టీహెచ్‌ చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిశోధకులు. 2006లో మొదటిసారి, 2018లో రెండోసారి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి ఆరోగ్య పరిస్థితుల్ని అంచనావేశారు. ఆ డేటా మొత్తాన్ని ఇటీవల విశ్లేషించారు. ఒంటరిగా ఉండటం కన్నా ఒంటరితనంలో ఉన్నామన్న భావనకి ప్రాధాన్యమిచ్చారు. తాము ఏకాకులం అన్న బాధ ఓ మోస్తరుగా ఉన్నవారిలో- మిగతావారికన్నా 25 శాతం గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఆ వెలితి తీవ్రంగా ఉన్నవారిలో ఏకంగా 45 శాతం గుండెపోటు ప్రమాదం కనిపించిందట. కాబట్టి, వృద్ధుల్లో నాటికీ పెరుగుతున్న ఈ ఒంటరితనం భావనపైన సమాజం తక్షణం దృష్టిసారించాలంటున్నారు పరిశోధకులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..