నారేప వృక్షం

కలప తడిస్తే త్వరగా పాడవుతుంది. తేమ వల్ల చెద పట్టొచ్చు, పగుళ్లు కూడా రావొచ్చు. అయితే కలపతోనే తయారయ్యే ఆలయాల్లోని ధ్వజస్తంభాలు మాత్రం వానకు తడిసినా, ఎండకు ఎండినా చాలాకాలం పాటు ఏ మాత్రం చెక్కు చెదరవు.

Published : 07 Jul 2024 00:42 IST

కలప తడిస్తే త్వరగా పాడవుతుంది. తేమ వల్ల చెద పట్టొచ్చు, పగుళ్లు కూడా రావొచ్చు. అయితే కలపతోనే తయారయ్యే ఆలయాల్లోని ధ్వజస్తంభాలు మాత్రం వానకు తడిసినా, ఎండకు ఎండినా చాలాకాలం పాటు ఏ మాత్రం చెక్కు చెదరవు. అందుకు కారణం దైవశక్తే అని చాలామంది నమ్ముతుంటారు. నిజానికి ధ్వజస్తంభంకోసం వాడే నారేప వృక్షం ప్రత్యేకత వల్లే అది సాధ్యమవుతోంది. మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా దొరికే ఈ కలప చాలా దృఢంగా ఉండటంతో ఉక్కుతో పోలుస్తారు. తక్కువ కొమ్మలతో నిటారుగా పెరిగే నారేప చెట్టు ప్రకృతి విపత్తులను తట్టుకుంటుంది. తడిసినా ఎండినా పాడవదు. చెదలూ, పగుళ్లూ రావు. ఎన్నాళ్లైనా చెక్కుచెదరదు కాబట్టే ధ్వజస్తంభాల కోసం ఈ చెట్టును ఎంపిక చేస్తారు. వెదురు మాదిరే దీన్ని కూడా ఎక్కడకు తరలించాలన్నా అటవీశాఖ అధికారుల అనుమతి అవసరం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..