అక్కడ తిండి నచ్చక ఇబ్బందిపడ్డా!
తెలుగు, తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటూ.. ఇండస్ట్రీలో తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్న చెన్నై భామ మేఘా ఆకాశ్. త్వరలో రావణాసుర, మనుచరిత్ర... వంటి సినిమాలతో తెరమీద సందడి చేయనున్న మేఘ... తన ఇష్టాయిష్టాలనూ వివరిస్తోందిలా..
జ్యూస్‌లే ఆహారం
ధనుష్ సినిమా ‘ఎనై నోకి పాయుమ్ తూట’ చేస్తున్నప్పుడు ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ ప్రత్యేకంగా దొరికే ఆహారపదార్థాలను రుచి చూసేవాళ్లం. అలా కేరళలో అరటికాయ చిప్స్, ముంబయిలో కబాబ్‌లు... వంటివీ తిన్నాం. అయితే తుర్కియేకి వెళ్లినప్పుడు మాత్రం చాలా ఇబ్బందిపడ్డా. కొన్నిగంటలపాటు విమానంలో ప్రయాణించి ఎయిర్‌పోర్ట్‌లో దిగాక విపరీతమైన ఆకలి వేసింది. కానీ అక్కడున్న వంటకాలన్నీ కొత్తగా అనిపించాయి. చివరకు అన్నం, కూర ఆర్డరిస్తే.. రుచి అస్సలు బాలేదు. దాంతో అక్కడ తక్కువ రోజులే ఉన్నా... ఏవీ నచ్చక పండ్లరసాలతోనే ఆకలి తీర్చుకోవాల్సి వచ్చింది.
చాలా భయపడ్డా
‘లై’ మొదటిరోజు షూటింగ్ నాకు ఇప్పటికీ గుర్తే. నాన్న వల్ల నాకు చిన్నప్పటినుంచీ తెలుగు అర్థమైనా కూడా మరీ స్పష్టంగా మాట్లాడేదాన్ని కాదు. దాంతో షూటింగ్ ఎలా చేస్తానోననే కంగారు, భయం నాలో మొదలయ్యాయి. దర్శకుడు అది అర్థంచేసుకున్నాడనుకుంటా.. ప్రతి డైలాగునీ ఎలా చెప్పాలో వివరించడంతో ఆత్మవిశ్వాసంతో ఆ సినిమాని పూర్తి చేశా.
బిడియం ఎక్కువే
నేను పుట్టిపెరిగిందంతా చెన్నై. అమ్మానాన్నలకు నేనొక్కదాన్నే సంతానం. బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్స్ చేశా. మా నాన్నది తెలుగు నేపథ్యం అయితే అమ్మ మలయాళీ. నాన్నా, నానమ్మల వల్ల నాకు కూడా కొంచెం తెలుగు వచ్చు. ఇక.. నేను మొదటినుంచీ కాస్త సిగ్గరినే. ఒకప్పుడు నలుగురితో ధైర్యంగా మాట్లాడేదాన్ని కాదు. కాలేజీకి వచ్చాక నన్ను నేను మార్చుకోవాలనుకున్నా. అందుకే ఓ వైపు చదువుకుంటూనే పాకెట్‌మనీ కోసం చిన్నచిన్న ప్రకటనల్ని చేసేదాన్ని. క్రమంగా సినిమా అవకాశాలూ రావడంతో చేయడానికి సిద్ధమయ్యా.
తీరిక దొరికితే...
హాయిగా ఇంట్లోనే ఉంటా. లేదంటే మా కజిన్స్‌తో గడిపేందుకు ప్రయత్నిస్తా.
అమ్మ ఉండాల్సిందే
చుట్టూ ఎంతమంది ఉన్నా... నా అనుకున్నవాళ్లు లేకపోతే నేను ఒంటరిననే భావన నాలో మొదలవుతుంది. అందుకే అమ్మ యాడ్ ఫిలిం డైరెక్టర్ అయినా... తనకు ఖాళీ దొరికినప్పుడల్లా నాతో షూటింగ్‌లకు వస్తుంది.
ఆయనే వచ్చి పేరు అడిగారు
చిన్నప్పటినుంచీ రజినీసార్‌కు నేను పెద్ద అభిమానిని. జీవితంలో ఒక్కసారైనా ఆయన పక్కన నిల్చుని ఓ ఫొటో తీసుకునే అవకాశం వస్తే చాలనుకున్నా. అలాంటిది నాకు ఆయనతో కలిసి నటించే ఛాన్సే వచ్చింది. కొన్నాళ్లక్రితం రజినీసార్ సినిమా ‘పేట’లో ఛాన్స్ ఉందంటూ ఫోన్ వచ్చింది. మొదట నమ్మలేదు సరికదా నన్నెవరో ఆటపట్టిస్తున్నారనుకున్నా. కాసేపటికి అది నిజమని తెలిశాక ఎగిరి గంతేసినంత పనిచేశా. అయితే... నాకూ రజినీసార్‌కూ సంబంధించిన మొదటి సీన్‌లో ఆయన ముందు నటించేందుకు కంగారుపడిపోయా. నావల్ల కాదని అర్థమైపోయింది. కాసేపటికి రజినీ సార్ వచ్చి.. నా పేరు అడిగి, నాతో కాసేపు మాట్లాడటంతో డైరెక్టర్ చెప్పినట్లుగా సీన్ చేయగలిగా.
సెలెబ్రిటీ క్రష్
ఇంకెవరూ ప్రముఖ క్రికెటర్ ఎం.ఎస్.ధోనీనే. నేను ధోనీకి అభిమానిని అనడం కన్నా.. అతడిని ఆరాధిస్తానని చెప్పడం కరెక్టేమో. అతడితో కలిసి ఫొటో దిగే అవకాశం వచ్చినప్పుడు... ప్రపంచాన్ని జయించినంత ఆనందం వేసింది. ఇప్పటికీ ఆ ఫొటోలను నా దగ్గర అపురూపంగా దాచుకున్నా.
* ఇష్టమైన ప్రదేశం...
బీచ్ ఉన్న ఏ ప్రాంతమైనా నచ్చుతుంది.
* హాబీలు...
పాటలు వినడం, పుస్తకాలు చదవడం.
* నచ్చే హీరోయిన్...
త్రిష
* ఇష్టమైన ఆహారం...
చాక్లెట్, చికెన్
* ఇష్టపడే ఆట...
క్రికెట్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Movies News
94 ఏళ్ల వయసులో మళ్లీ కెమెరా ముందుకు
-
World News
Taliban: బంధుప్రీతిపై తాలిబన్ల కన్నెర్ర..!
-
India News
Shocking: షాకింగ్.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రభుత్వ ఉద్యోగి మృతి!
-
World News
Japan: చైనాకు చెక్ పెట్టేలా.. రూ.6 లక్షల కోట్లతో భారీ ప్రణాళిక!
-
Sports News
Virender Sehwag: టీమ్ఇండియా కోచింగ్ ఆఫర్.. నాకు ఆ అవకాశం రాలేదు!:సెహ్వాగ్
-
Movies News
Vishwak Sen: ఇండస్ట్రీలో నన్నెవరూ తొక్కేయాలనుకోలేదు.. విశ్వక్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు