Updated : 14 Nov 2021 05:28 IST

ఈ నమ్మకాలే ఎందుకంటే..

ఏదయినా ఓ పనిని ప్రారంభించే ముందు ఫలానా రంగు డ్రెస్‌నే వేసుకోవడం... తప్పనిసరిగా గుడికి వెళ్లాలనుకోవడం చాలామంది చేసేదే. మరి తెరమీద నటించే హీరోహీరోయిన్లకు కూడా అలాంటి సెంటిమెంట్లు ఉంటాయా అంటే ఉంటాయనే అంటున్నారు కొందరు.అవేంటో కాస్త చూద్దామా..


గణపతి ఆలయానికి వెళ్తే హిట్‌ - దీపికా పదుకొణె

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణెకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆమె ఓ సినిమా ఒప్పుకుంటే... అది కచ్చితంగా హిట్‌ అయి తీరుతుందనేది దర్శకనిర్మాతల నమ్మకమైతే... ఆమె మాత్రం తన సినిమా విడుదలకు ముందు వినాయకుడి ఆశీస్సులు తప్పనిసరిగా తీసుకుంటుందట.  తన ప్రతి సినిమా విడుదలకు ముందు ముంబయిలోని సిద్ధివినాయక ఆలయానికి వెళ్లి, పూజలు నిర్వహిస్తుంది దీపిక. అలా చేస్తే ఆ సినిమా కచ్చితంగా హిట్‌ అవుతుందనేది తన నమ్మకమని అంటుంది దీపిక.


ఆ నంబరంటే ఇష్టం- ఎన్టీఆర్‌

ఎంతో ఇష్టంగా కొనుక్కునే వాహనానికి ఫ్యాన్సీ నంబరు ఉండాలని కోరుకోవడం మామూలే కానీ... ఎన్టీఆర్‌ మాత్రం 9999 నంబరు కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టేందుకు అస్సలు వెనకాడడు. ఈ మధ్యే తాను కొన్న లాంబోర్గినీ కారుకు ఆ నంబరు తెచ్చుకునేందుకు సుమారు పదిహేడు లక్షల రూపాయలు పెట్టాడట. ఆ సంఖ్య పైన ఎందుకంత ఇష్టమంటే... ‘మా తాతగారి కారుకు అదే నంబరు ఉండేది. ఆ తరువాత నాన్న కూడా తన కార్లకు ఆ నంబరునే వాడారు. చిన్నప్పటినుంచీ వాటిని చూశాక... అదే నా లక్కీనంబర్‌ అయిపోయింది. అందుకే నేను కొనే ప్రతి కారుకీ ఆ నంబరే ఉండేలా చూసుకుంటా...’ అని చెప్పే తారక్‌ ట్విటర్‌ అకౌంట్‌ పేరులోనూ 9999 ఉంటాయి తెలుసా..


ముహూర్తం రోజున రాకపోవచ్చు- మహేష్‌బాబు

హీరోహీరోయిన్‌ అయినా... సినిమా ఒప్పుకున్నాక ముహూర్తపుషాట్‌కూ, ఆ రోజున చేసే పూజా కార్యక్రమాలకూ తప్పనిసరిగా వస్తారు. కానీ ఎన్నో హిట్‌ సినిమాలను అందించిన మహేష్‌బాబు మాత్రం ముహూర్తపు షాట్‌కు హాజరవ్వకుండా నేరుగా షూటింగ్‌కే వెళ్తాడట. అదేవిధంగా షూటింగ్‌ అంతా పూర్తయ్యాక అజ్మీర్‌, అమీన్‌పీర్‌ దర్గాలకు వెళ్లొచ్చేందుకు ప్రయత్నిస్తాడట. అలా ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఆగడు’, ‘దూకుడు’, ‘బిజినెస్‌మ్యాన్‌’ సినిమాల విడుదలకు ముందు అక్కడికి వెళ్లొచ్చాడట. ఇవేవీ పెద్ద సెంటిమెంట్లుగా పాటించకపోయినా ముందునుంచీ అలాగే కొనసాగిస్తున్నాడట.


తొలి సీన్‌లో తెల్ల డ్రెస్‌ - కాజల్‌ అగర్వాల్‌

సినిమాల్లో హీరో హీరోయిన్‌లని పరిచయం చేసే సన్నివేశాలు కొత్తగా ఉండాలని దర్శకులు కోరుకుంటే... కాజల్‌ అగర్వాల్‌ మాత్రం ఆ సీన్‌లలో సాధ్యమైనంతవరకూ తెలుపు రంగు డ్రెస్‌లో కనిపించాలనుకుంటుందట.  అలా నటిస్తే ఆ సినిమా కచ్చితంగా హిట్‌ అవుతుందనేది కాజల్‌ నమ్మకం. అందుకే తమిళంలో విజయ్‌ సరసన చేసిన ‘తుపాకి’లో, బాలీవుడ్‌లో అజయ్‌దేవగణ్‌తో నటించిన ‘సింగం’లోనూ తెలుపు రంగు డ్రెస్‌లో కనిపించింది. ఈ నమ్మకాన్ని మగధీర సినిమా నుంచీ పాటిస్తోందట.


జపమాల ఉండాల్సిందే- సాయిపల్లవి

చీరకట్టుకుంటే చేతినిండా గాజులు, జీన్స్‌ తొడిగితే బ్రేస్‌లెట్‌ పెట్టుకోవడం... అమ్మాయిలు చేసేదే. కానీ సాయి పల్లవి మాత్రం ఎలాంటి ఆహార్యమైనా సరే.. తన చేతికి జపమాల ఉండాల్సిందేనని అంటుంది. ‘కొన్నాళ్లక్రితం మా తాతయ్య ఆ జపమాలను నాకు ఇచ్చాడు. అప్పటినుంచీ దాన్ని చేతికి కట్టుకుని కాసేపు ధ్యానం చేయడం మొదలుపెట్టా. అలా చేస్తే నేను రోజంతా ప్రశాంతంగా ఉంటానని నా నమ్మకం. ఒక్క షూటింగ్‌లలో మాత్రమే దాన్ని కాసేపు పక్కన పెడతా తప్ప.మిగిలిన సమయమంతా ఆ జపమాల నా చేతికే ఉంటుంద’ని వివరిస్తుంది సాయిపల్లవి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని