సిల్లీ పాయింట్‌

చంద్రుడి మీద నుంచి మొదట మాట్లాడిన వ్యక్తి నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్‌ అయితే... ఆఖరుసారి (1972, డిసెంబరు 11న) మాట్లాడిన వ్యోమగామి యూజిన్‌సెర్నాన్‌. అమెరికా ప్రయోగించిన అపోలో 17 కమాండర్‌ ఆయన.

Updated : 30 Jul 2022 12:32 IST

సిల్లీ పాయింట్‌

చంద్రుడి మీద నుంచి మొదట మాట్లాడిన వ్యక్తి నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్‌ అయితే... ఆఖరుసారి (1972, డిసెంబరు 11న) మాట్లాడిన వ్యోమగామి యూజిన్‌సెర్నాన్‌. అమెరికా ప్రయోగించిన అపోలో 17 కమాండర్‌ ఆయన. ఆ తర్వాత మరే దేశమూ చంద్రుడి మీదకు మానవ సహిత యాత్రలు చేపట్టలేదు.

* మేకప్‌ వేసుకున్న మహిళలంతా మంత్రగత్తెలేనని నమ్మేవారు ఒకప్పుడు బ్రిటన్‌లో.

* ప్రపంచంలోనే అతి పెద్ద మానవనిర్మిత సరస్సు అమెరికాలో ఉంది. దానిపేరు మీడ్‌ సరస్సు.

* రక్తదానం చేసే సమయంలో మూత్రవిసర్జన చేయలేం.

* శబ్దం శూన్యంలో కన్నా స్టీలు వాహకాల ద్వారా 15 రెట్లు వేగంగా పయనించగలదు.

* ఓక్‌ వృక్షానికి యాభై ఏళ్లొచ్చేదాకా కాయలు కాయవు.

* ఏదైనా విమానప్రమాదం జరగ్గానే బ్లాక్‌బాక్స్‌ కోసం వెదుకుతారు.

* ప్రమాద వివరాలను తెలుసుకునేందుకు ఉపయోగపడే ఈ బ్లాక్‌బాక్స్‌ నిజానికి కాషాయరంగులో ఉంటుంది.

* ప్రపంచంలో అత్యధికంగా ఐస్‌క్రీమ్‌ అమ్మకాలు జరిగే దేశం ఆస్ట్రేలియా.

* 1932లో వచ్చిన ఇంద్రసభ అనే హిందీ సినిమాలో 71 పాటలున్నాయి.

* ఆపద వచ్చినప్పుడు ఆడ నిప్పుకోడి గుర్రం కన్నా వేగంగా పరిగెత్తగలదు.

* ప్రపంచవ్యాప్తంగా ఎలుకలకు భయపడేవారికన్నా కప్పలకు భయపడేవారి సంఖ్యే అధికం అని ఒక సర్వే.

* రహదారుల మధ్యలో మెరుస్తూ కనిపించేలా అమర్చే పరికరాల్ని బాట్స్‌ డాట్స్‌ అంటారు.

* యురేనస్‌ ఉత్తర ధ్రువం వద్ద వేసవికాలం 21 సంవత్సరాలపాటు (మనలెక్కల్లో) ఉంటుంది.

* ఆడవారికన్నా మగవాళ్లకు సగటున 40 శాతం అధికంగా చెమట పడుతుంది.

* గడ్డంలో ఏడు నుంచి 15 వేల దాకా వెంట్రుకలుంటాయి.

* కంటిచూపు సరిగ్గా ఉన్నవారు సగటున 200 డిగ్రీల మేర ఒకేసారి చూడగలరు.

* కలువపూల విత్తనాలు సాధారణ ఉష్ణోగ్రతలో వందేళ్లయినా పాడవవు.

* జపాన్‌లో మిగతా పళ్లతో పోలిస్తే పుచ్చకాయల ధర అత్యధికం.

* న్యూజిలాండ్‌ దేశ జనాభాకంటే గొర్రెలే ఎక్కువ. మనుషులు 40 లక్షలయితే అక్కడున్న గొర్రెలు 70 లక్షలు.


* పులి ఒంటి మీద సగటున 100 చారలుంటాయి.


* సీతాకోక చిలుకలు గులాబీ పూలను ఇష్టపడవు.


* మనిషి తన జీవితకాలంలో చుంబనాలకు ఖర్చుచేసే సమయం సగటున 20,160 నిమిషాలు.


* ప్రపంచంలోని సగటు స్కూలు దినాల సంఖ్య 200. జపాన్‌లో ఇది అత్యధికం 243 రోజులు కాగా, స్వీడన్‌లో 170 రోజులు అత్యల్పం.


* అమెరికాలోని న్యూహ్యాంప్‌షైర్‌లో తిరిగే చాలా కార్ల నెంబర్‌ప్లేట్లపై ‘లివ్‌ ఫ్రీ ఆర్‌ డై’ (స్వేచ్ఛగా బతుకు లేదా చావు) అని ఉంటుంది. అది ఆ రాష్ట్ర నినాదం.


* వెంట్రుకపాటి అని తీసిపారేస్తాంగానీ ఒక తలవెంట్రుక సుమారు మూడు కిలోల బరువును మోయగలదట.


* ఈగలు ఏదయినా వస్తువుపై వాలి తిరిగి ఎగిరేటప్పుడు ముందుకాళ్లతో ముందుకు లేవవు. వెనుకకాళ్లతో వెనుకవైపు నుంచి లేస్తాయి.


* పెదాలకు పూసుకునేందుకు వాడే చాలా రకాల లిప్‌స్టిక్స్‌ తయారీలో చేప పొలుసులను ఉపయోగిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..