ఆ వ్యాక్సీన్‌తో ఫ్లూ జ్వరాలకు చెక్‌!

స్వైన్‌ఫ్లూ, ఎబొలా, కొవిడ్‌... వంటి ఫ్లూ వైరస్‌ రకాలన్నీ మానవాళిని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఇక, సాధారణ జలుబుకి కారణమైన ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ కూడా తక్కువేమీ కాదు.

Updated : 18 Dec 2022 03:56 IST

ఆ వ్యాక్సీన్‌తో ఫ్లూ జ్వరాలకు చెక్‌!

స్వైన్‌ఫ్లూ, ఎబొలా, కొవిడ్‌... వంటి ఫ్లూ వైరస్‌ రకాలన్నీ మానవాళిని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఇక, సాధారణ జలుబుకి కారణమైన ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ కూడా తక్కువేమీ కాదు. అందుకే ఇలాంటి 20 రకాల ఫ్లూ వైరస్‌లను నిరోధించేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు ఎమ్‌-ఆర్‌ఎన్‌ఏను ఉపయోగించి వ్యాక్సీన్‌ను రూపొందించారు. ఇది మున్ముందు ఫ్లూ సంబంధిత వ్యాధుల్ని సమర్థంగా నిరోధిస్తుంది అంటున్నారు. ఇప్పటికే ఎమ్‌-ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీని కొవిడ్‌కు అడ్డుకట్ట వేసే ఫైజర్‌, మోడర్నా వ్యాక్సీన్ల తయారీలో వాడారట. జంతువుల్లో వీటిని పరిశీలించినప్పుడు ఇది వ్యాధిని ఎదుర్కోగలిగినట్లు గుర్తించారు. కాబట్టి మరోసారి ఫ్లూ సంబంధిత వైరస్‌లు ప్రబలకుండా ఈ రకమైన వ్యాక్సీన్‌ను వాడొచ్చు అని భావిస్తున్నారు. ఈ వైరస్‌లన్నీ పక్షులూ, పందులూ... ఇతరత్రా జంతువుల నుంచి మనుషులకి సంక్రమిస్తుంటాయి. అలా ఒకదాన్నుంచి మరొక దాంట్లోకి ప్రవేశించేటప్పుడు జన్యుమార్పులు చోటుచేసుకోవడంతో అవి మనుషుల్లో మరణాలకు కారణమవుతున్నాయి. అయితే ఈ రకమైన వ్యాక్సీన్‌ ఇవ్వడంవల్ల ఏ రకమైన ఫ్లూ వైరస్‌ దాడి చేసినా లోపలున్న ఆర్‌ఎన్‌ఏ సంబంధిత యాంటిజెన్‌ దాన్ని గుర్తుంచుకుని కొత్తదాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతుందట. దాంతో వ్యాధి తీవ్రత చాలావరకూ తగ్గి మరణాల రేటు తగ్గుతుంది అంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..