weekly horoscope: రాశిఫలం (ఏప్రిల్‌ 2 - ఏప్రిల్‌ 8)

ఉద్యోగంలో తెలియని ఆటంకాలు ఎదురవుతాయి. గత అనుభవంతో తెలివిగా సమస్యను పరిష్కరించండి. సకాలంలో పనులు ప్రారంభిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Updated : 02 Apr 2023 02:44 IST

weekly horoscope: రాశిఫలం (ఏప్రిల్‌ 2 - ఏప్రిల్‌ 8)


ఉద్యోగంలో తెలియని ఆటంకాలు ఎదురవుతాయి. గత అనుభవంతో తెలివిగా సమస్యను పరిష్కరించండి. సకాలంలో పనులు ప్రారంభిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రయత్నపూర్వక విజయాలు ఉంటాయి. కుటుంబపరమైన సౌఖ్యం లభిస్తుంది. ఆర్థిక అభివృద్ధి శుభప్రదంగా ఉంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. సూర్యధ్యానం మంచిది.


ఉద్యోగ ఫలితాలు సంతోషాన్నిస్తాయి. అధికారుల అండ లభిస్తుంది. సర్వత్రా విజయవంతంగా ఉంటుంది. శత్రుదోషం తొలగుతుంది. నూతన కార్యాలను చేపడతారు. కొత్త ఆలోచనలతో బంగారు భవిష్యత్తు లభిస్తుంది. విఘ్నాలను అధిగమించి కార్యసిద్ధిని పొందాలి. దైవబలం సదా ముందుకు నడిపిస్తుంది. శనిధ్యానం శుభాన్నిస్తుంది.


సంపూర్ణ ధనలాభం సూచితం. ఉద్యోగంలో ఖ్యాతి లభిస్తుంది. అధికార లాభం గోచరిస్తోంది. బంధుమిత్ర సమాగమంతో ఆనందంగా ఉంటారు. ఉత్సాహంగా పనిచేసి కీర్తి ప్రతిష్ఠలను పొందండి. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. సంపాదన పెరుగుతుంది. సంతృప్తికరమైన ఫలితాలుంటాయి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. లక్ష్మీఆరాధన శుభప్రదం.


ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఏకాగ్రతతో పనిచేస్తే విజయం లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. బాధ్యతాయుతంగా నిర్ణయాలు తీసుకోండి. మితభాషణం శక్తినిస్తుంది. మిత్రభావంతో ముందుకు సాగాలి. గృహలాభం సూచితం. పట్టుదలతో చేసే కార్యాలు విజయాన్నిస్తాయి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.


ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ధైర్యంగా పని ప్రారంభించండి. ప్రయత్నపూర్వక విజయాలు ఉంటాయి. మనోబలంతో లక్ష్యాన్ని చేరాలి. ఆర్థిక వృద్ధి శుభప్రదం. గురుభక్తితో ధర్మమార్గంలో ముందుకు సాగండి. అభీష్ట సిద్ధి ఉంది. మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. వారాంతంలో శుభవార్త వింటారు. శివారాధన శుభప్రదం.


ఆత్మవిశ్వాసంతో పని చేస్తే ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి. గౌరవం పెరుగుతుంది. ఇష్టకార్యాలు పూర్తవుతాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. బంధుమిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది. సూర్యధ్యానం మంచిది.


ఉద్యోగంలో సత్ఫలితాలుంటాయి. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి లభిస్తుంది. మనోబలంతో లక్ష్యాన్ని చేరండి. విఘ్నాలను జాగ్రత్తగా అధిగమించాలి. అడుగడుగునా ఆటంకపరిచేవారున్నారు. ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. వ్యాపారంలో సమస్యలను తెలివిగా పరిష్కరించాలి. ఆర్థికంగా మిశ్రమ కాలం. మొహమాటం వల్ల ఖర్చు పెరుగుతుంది. నవగ్రహధ్యానం శుభప్రదం.


వ్యాపారయోగం బ్రహ్మాండంగా ఉంటుంది. అనేకవిధాలుగా లాభాలు గోచరిస్తున్నాయి. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుని విజయం సాధించండి. ఉద్యోగంలో ప్రయత్నాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. అదృష్టయోగం ఉంది. సకాలంలో పనిచేయండి. శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది.


ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. ఒక విషయంలో విజయం సాధిస్తారు. బుద్ధిబలంతో పనిచేసి ఉద్యోగంలో సత్ఫలితాలు పొందండి. స్థిరత్వం ఏర్పడుతుంది. దైవబలం కాపాడుతోంది. గతంలో ఎదురైన ఇబ్బందులు పరిష్కారమవుతాయి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సలహాలు అవసరం. ఇష్టదైవాన్ని స్మరిస్తే శుభం జరుగుతుంది.


బ్రహ్మాండమైన శుభకాలం నడుస్తోంది. త్వరగా పనులు పూర్తవుతాయి. ఉద్యోగ ఫలితాలు ఆనందాన్నిస్తాయి. అధికార లాభం, పదోన్నతులు సూచితం. అధిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారం బాగుంటుంది. బుద్ధిబలంతో లక్ష్యాలను పూర్తిచేయండి. సుఖం లభిస్తుంది. మంచి పేరు సంపాదిస్తారు. అనుకున్నది సాధిస్తారు. లక్ష్మీదర్శనం శక్తినిస్తుంది.


ధర్మ కార్యాచరణ ద్వారా ఉద్యోగంలో విజయం లభిస్తుంది. మానసిక దృఢత్వం అవసరం. శ్రేష్ఠమైన ఫలితాలుంటాయి. విజ్ఞానపూర్వకమైన విజయాలు ఉంటాయి. శత్రుదోషం తొలగుతుంది. యశస్సు పెరుగుతుంది. మనసుకి ఆనందం కలుగుతుంది. వ్యాపారంలో ఏకాగ్రతను పెంచాలి. ధనయోగముంది. శుభవార్త వింటారు. సూర్యధ్యానం మంచిది.


వ్యాపారలాభాలు విశేషంగా ఉంటాయి. అధిక ధనలాభం సూచితం. పెట్టుబడులు లాభిస్తాయి. అనుకున్నది సాధిస్తారు. కీర్తి పెరుగుతుంది. మంచి జరుగుతుంది. ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తే గుర్తింపు లభిస్తుంది. ఒత్తిడిని జయించాలి. నిరంతర సాధనతో కార్యసిద్ధి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. శివస్మరణ శక్తినిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు