Weekly Horoscope: రాశిఫలం( ఏప్రిల్‌ 10- ఏప్రిల్‌ 16)

ధర్మమార్గంలో విజయాన్ని సాధిస్తారు. కలిసికట్టుగా చేసే పనుల్లో లాభముంటుంది. ప్రతికూలతలను సమర్థంగా ఎదుర్కొంటారు. ఉద్యోగంలో అనుకున్న ఫలితాలు ఉంటాయి. మనోబలం తగ్గరాదు. ఆశయం నెరవేరేవరకు ప్రయత్నించాలి.

Updated : 04 Aug 2022 17:09 IST

Weekly Horoscope: రాశిఫలం( ఏప్రిల్‌ 10- ఏప్రిల్‌ 16)

ధర్మమార్గంలో విజయాన్ని సాధిస్తారు. కలిసికట్టుగా చేసే పనుల్లో లాభముంటుంది. ప్రతికూలతలను సమర్థంగా ఎదుర్కొంటారు. ఉద్యోగంలో అనుకున్న ఫలితాలు ఉంటాయి. మనోబలం తగ్గరాదు. ఆశయం నెరవేరేవరకు ప్రయత్నించాలి. వ్యాపారంలో  లాభముంటుంది. సమయానుకూల నిర్ణయాలు కలిసివస్తాయి. ఇష్టదైవాన్ని తలచుకుంటే మంచిది.


ఆత్మవిశ్వాసంతో పని ప్రారంభించండి, కాలం అంతగా సహకరించటం లేదు. వ్యతిరేకతలున్నాయి. మౌనంగా పనిచేసుకోవాలి. పెద్దల ఆశీర్వచనముంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక నష్టం సూచితం. చంచలత్వం లేకుండా సమాధానమివ్వాలి. ఆస్తి విషయాలలో స్పష్టత వస్తుంది. వారాంతంలో శాంతి లభిస్తుంది. శివస్మరణ మేలుచేస్తుంది.


ఉత్తమకాలం నడుస్తోంది. పనులు త్వరగా అవుతాయి. అదృష్టయోగముంది. తగినంత ప్రయత్నం చేయాలి. అపోహలు తొలగుతాయి. ప్రేమానుబంధం బలపడుతుంది. కొందరి వల్ల ఉపకారం జరుగుతుంది. ఏదీ తెగేదాకా లాగవద్దు. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకం. మీ కృషి ఫలించి అనుకున్నది సాధిస్తారు. ఇష్టదేవతా దర్శనం ఉత్తమం.


ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. అపార్థాలకు తావివ్వకూడదు. వ్యాపారంలో అప్రమత్తంగా ఉండాలి, నష్టం గోచరిస్తోంది. వృథా వ్యయాన్ని నివారించండి. మొహమాటం శ్రమ కలిగిస్తుంది. వారం మధ్యలో తెలియని ఆపదలున్నాయి. దగ్గరివారితో విభేదాలు రాకుండా జాగ్రత్తపడాలి. విష్ణుసహస్రనామం చదివితే మంచిది.


దైవబలంతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. మీ పట్టుదల లక్ష్యాన్ని చేరుస్తుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితముంటుంది. ఏదీ మనసుకు తీసుకోవద్దు. ఆర్థికంగా అనుకూలం. వ్యాపారంలో కష్టపడాలి. ధర్మమార్గంలో వెళ్తే అంతా శుభమే. వారం మధ్యలో ఒక వార్త ఆనందాన్నిస్తుంది. పోయినవి తిరిగి లభిస్తాయి. దుర్గాదేవిని దర్శించండి. సంతృప్తి లభిస్తుంది.


ముఖ్య కార్యాల్లో అనుకూల ఫలితాలున్నప్పటికీ విజయం కోసం శ్రమించాలి. తెలియని విఘ్నాలున్నాయి. ఆవేశం పనికిరాదు. ఈర్ష్య పడేవారున్నారు. వ్యాపారం కొంతవరకు బాగుంటుంది. కుటుంబసభ్యుల సలహాలతో లాభపడతారు. ఒక ఆపద నుండి బయటపడతారు. సందేహాస్పద విషయాల్లో తొందరపడవద్దు. భవిష్యత్తు బాగుంటుంది. శివస్మరణ ఉత్తమం.


అనుకూల కాలమిది. ఉత్తమ ఫలాలుంటాయి. ఉద్యోగంలో పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. కష్టాలను ఎదుర్కోగల ధైర్యం లభిస్తుంది. వ్యాపార లాభం, అదృష్టయోగం సూచితం. కాలాన్ని సత్కార్యాలకై వినియోగించండి. కుటుంబపరంగా సంతృప్తి లభిస్తుంది. సమస్యలు తొలగుతాయి. వ్యాపారం విస్తరించే అవకాశముంది. ఇష్టదేవతారాధన శ్రేయస్సును పెంచుతుంది.


వ్యాపారబలం పెరుగుతుంది. ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది. పలు మార్గాల్లో విజయముంటుంది. ప్రణాళిక ప్రకారం పనిచేయండి. శ్రేష్ఠమైన జీవితం లభిస్తుంది. వివాదాలకు అవకాశముంది. దగ్గరివారి నుండి తగినంత సహకారం లభిస్తుంది. త్రికరణశుద్ధితో ముందుకు సాగండి, ఆశయం నెరవేరుతుంది. లక్ష్మీ ఆరాధన మంచిది.


ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచండి. సత్వర కార్యసిద్ధి మీ సొంతమవుతుంది. చురుగ్గా లక్ష్యాన్ని చేరండి. ఉద్యోగంలో ఏకాగ్రత పెంచాలి, ఈర్ష్యపడే వారున్నారు. ఆపదలు తొలగుతాయి. గందరగోళస్థితి నుంచి బయటపడతారు. ధర్మదేవత అనుగ్రహిస్తుంది. న్యాయం జరుగుతుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. ఇష్టదేవతను ధ్యానించండి, ప్రశాంతత లభిస్తుంది.


అనేక మార్గాల్లో శుభాలున్నాయి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. కాలం అన్నివిధాలా సహకరిస్తోంది. సద్వినియోగం చేసుకోండి. వ్యాపారరీత్యా అధిక లాభాలుంటాయి. తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. బాధ్యతలను చక్కగా పూర్తి చేస్తారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఇష్టదేవతను స్మరిస్తే మేలు.


ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. అవగాహనకి అనుభవాన్ని జోడించి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఆర్థికంగా బాగుంటుంది. పనులు వాయిదా వేయవద్దు. ఆధ్యాత్మిక చైతన్యంతో మనసుకు శక్తి లభిస్తుంది. మీరు ఎంచుకున్న మార్గంలోనే బంగారు భవిష్యత్తు ఉంది. కుటుంబ సహకారంతో కష్టాలు దూరమవుతాయి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి.


వ్యాపారబలం పెరుగుతుంది. ఆర్థిక స్థితి అనుకూలం. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యాలను సాధించండి. స్థిరబుద్ధితో పనిచేయాలి. తెలియని చంచలత్వం ఆవహిస్తుంది. ముఖ్య వ్యక్తుల సలహాలు అవసరం. ఉద్యోగరీత్యా ఇబ్బందులు సూచితం. శాంతం చాలా వరకు శక్తినిస్తుంది. ఓర్పుతో ముందుకు సాగండి. సూర్య నమస్కారం శుభప్రదం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..