Updated : 05 Feb 2023 02:27 IST

weekly horoscope: రాశిఫలం (ఫిబ్రవరి 5 - 11)


సూర్యబలంతో అధికారయోగం కనిపిస్తోంది. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. విజయం లభిస్తుంది. చంచలత్వం వల్ల విఘ్నాలు ఉంటాయి. ఓర్పూ ఏకాగ్రతా అవసరం. నమ్మిన సిద్ధాంతంతోనే ముందుకు సాగాలి. ఆవేశపరిచేవారున్నారు. వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి. సమయస్ఫూర్తి ప్రదర్శించండి. ఇష్టదైవాన్ని స్మరిస్తే శుభం జరుగుతుంది.


సకాలంలో పనులు ప్రారంభించండి, అదృష్టవంతులవుతారు. లక్ష్యం సిద్ధించేవరకు కృషి ఆపవద్దు. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. ధర్మమార్గంలో నిర్ణయాలు తీసుకోండి. అభీష్టసిద్ధి ఉంటుంది. ఒత్తిడిని అధిగమించాలి. అందరితో సౌమ్యంగా నడచుకోవాలి. వ్యాపారంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. నవగ్రహశ్లోకాలు చదివితే మేలు.


ఆర్థికంగా కలసివస్తుంది. అవసరాలకు ధనం అందుతుంది. ముఖ్యకార్యాల్లో శ్రద్ధపెంచాలి. తెలియని ఆటంకాలుంటాయి. సరైన ప్రణాళికతో చేసే పనులు అద్భుత విజయాన్నిస్తాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. వివాదాలకు అవకాశమివ్వవద్దు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు మంచిది. నవగ్రహ శ్లోకాలు శక్తినిస్తాయి.


శుభకాలం నడుస్తోంది. అద్భుతమైన విజయాలు వరిస్తాయి. మానవప్రయత్నం చేయండి. పలుమార్గాల్లో లబ్ధిపొందుతారు. భూగృహవాహనాది శుభయోగాలుంటాయి. అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో అధికారలాభం సూచితం. పెద్దల ఆశీస్సులతో పైకి వస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. దైవదర్శనం ఆనందాన్నిస్తుంది.


కాలం మిశ్రమంగా ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మనసుపెట్టి పనిచేయండి. స్వయంగా చేసే పనులు త్వరగా విజయాన్నిస్తాయి. ధర్మం కాపాడుతుంది. కొన్ని విషయాల్లో గందరగోళ స్థితి ఏర్పడుతుంది. ప్రశాంతంగా ఆలోచించాలి. వ్యాపారంలో లాభముంటుంది. నవగ్రహశ్లోకాలు చదవండి, ప్రశాంతత లభిస్తుంది.


ప్రశాంతంగా పనులు ప్రారంభించండి, విజయం లభిస్తుంది. దైవబలం రక్షిస్తోంది. ఉద్యోగంలో కీర్తి పొందుతారు. సమయానుకూల నిర్ణయాలతో వ్యాపారంలో అద్భుతమైన లాభాలుంటాయి. ఒక విషయం చేతిదాకా వచ్చి ఆగిపోతుంది. ఓర్పుతో ప్రయత్నించాలి. వారాంతంలో శుభవార్త వింటారు. సూర్య నమస్కారం శుభాన్ని ఇస్తుంది.


మనోబలంతో సత్వర విజయం లభిస్తుంది. అవసరాలకు ధనం అందుతుంది. మొహమాటం వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి. తొందరలో పొరపాటు జరగనివ్వద్దు. సమస్యను అర్థంచేసుకుని శాంతంగా పరిష్కరించుకోండి. అనుకున్న మార్గంలోనే ముందుకెళ్లండి. కలహాలకు తావివ్వద్దు. నవగ్రహశ్లోకాలు చదివితే మంచిది.


కాలం సహకరిస్తోంది, విశేషమైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పెద్దల అనుగ్రహంతో అభివృద్ధిని సాధిస్తారు. అధికారలాభం సూచితం. మీ నిర్ణయాలు నలుగురికీ ఉపయోగకరంగా ఉంటాయి. వ్యాపారంలో అద్భుతమైన విజయం ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబపరంగా కలసివస్తుంది. ఇష్టదైవస్మరణతో ఇబ్బందులు తొలగుతాయి.


సందేహించకుండా నిర్ణయం తీసుకోండి. బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుంటారు. గతంలో కాదనుకున్న పని ఇప్పుడు అవుతుంది. ఉద్యోగంలో పైకి వస్తారు. వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్తపడాలి. ధర్మాన్ని అనుసరించండి. బంధుమిత్రుల వల్ల ఆనందం కలుగుతుంది. ఆదిత్య హృదయం చదవండి, ఆటంకాలు తొలగుతాయి.


సంకల్పబలంతో లక్ష్యాన్ని చేరండి. కృషి అవసరం. తెలియని ఆటంకం ఉంది.ఉద్యోగంలో కష్టపడితేనే ఫలితం ఉంటుంది. సౌమ్యంగా సంభాషించాలి. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. స్వయంకృషి లాభిస్తుంది. వ్యాపారంలో ఆచితూచి అడుగేయాలి. చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టం కలిగిస్తుంది. సూర్యస్తోత్ర పఠనం శుభప్రదం.


అద్భుతమైన విజయాలుంటాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. స్థిరత్వం ఏర్పడుతుంది. గతంలో ఉన్న కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఉన్నత స్థితి గోచరిస్తోంది. దృఢసంకల్పంతో అనుకున్నది సాధించండి. ఆర్థికవృద్ధి విశేషంగా ఉంటుంది. లక్ష్మీ ఆరాధన మంచిది.


ఉద్యోగయోగం శుభప్రదం. ధర్మమార్గంలో లక్ష్యాన్ని చేరండి. అధికారుల వల్ల మేలు జరుగుతుంది. ఉత్సాహం ముందుకు నడిపిస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి. సంకల్పబలంతో పనిచేస్తే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో నష్టం గోచరిస్తోంది. సాహసకార్యాలు ఫలిస్తాయి. నవగ్రహశ్లోకాలు చదివితే ప్రశాంతత లభిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు