Weekly Horoscope: రాశిఫలం (మే 21-27)

Weekly Horoscope: 12 రాశులవారి ఈ వారం రాశి ఫలం వివరాలు...

Updated : 21 May 2023 06:36 IST


ధనయోగం ఉంది. ముఖ్యకార్యాల్లో విజయం లభిస్తుంది. పట్టుదల అవసరం. ఏ మాత్రం అశ్రద్ధ వహించినా సమస్య జటిలమవుతుంది. సకాలంలో పని ప్రారంభిస్తే మేలు జరుగుతుంది. అపార్థాలకు తావు లేకుండా మాట్లాడాలి. వ్యాపారంలో జాగ్రత్త. మిత్రుల సహకారం అవసరం. సమయోచిత నిర్ణయాలు శక్తినిస్తాయి. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి.


కార్యసిద్ధి ఉంది. ముందస్తు ప్రణాళికలతో లక్ష్యాన్ని చేరండి. బుద్ధిబలంతో కొన్ని సమస్యలు పరిష్కరిస్తారు. మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఆశయ సాధనలో మిత్రుల సహకారం ఉంటుంది. ఒక పనిలో విజయం లభిస్తుంది. ధనయోగం సూచితం. కొన్ని విషయాల్లో పరీక్షాకాలంగా అన్పిస్తుంది. ఓర్పుతో వ్యవహరించాలి. ఆదిత్య హృదయం చదివితే మనశ్శాంతి లభిస్తుంది. ఆదిత్య హృదయం కోసం క్లిక్‌ చేయండి.


వ్యాపారంలో విశేష లాభాలున్నాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు శుభాన్నిస్తాయి. నిర్మలమైన మనసుతో పని ప్రారంభించండి. పలువిధాలుగా కాలం సహకరిస్తుంది. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. స్వల్ప ప్రయత్నంతోనే కార్యసిద్ధి ఉంటుంది. చంద్రగ్రహశ్లోకం చదువుకుంటే మేలు. చంద్రగ్రహశ్లోకం కోసం క్లిక్‌ చేయండి


ఉద్యోగంలో శుభఫలితాలున్నాయి. తోటివారి ప్రశంసలు లభిస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యాన్ని చేరాలి. అభీష్టసిద్ధి ఉంది. అవరోధాలు ఎదురైనా బుద్ధిబలంతో అధిగమిస్తారు. వ్యాపారంలో జాగ్రత్త. తెలియని నష్టాలున్నాయి. వృథా వ్యయాన్ని తగ్గించాలి. ఆవేశపూరిత నిర్ణయాలు సమస్యని పెంచుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.


అదృష్టం వరిస్తుంది. నిర్ణయించుకున్న మార్గంలోనే ముందుకు వెళ్లండి. అనుకున్నది సాధిస్తారు. కాలం సహకరిస్తుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలుంటాయి. శ్రమ ఫలిస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తును ఇస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. భూగృహ వాహనాది యోగాలు ఉన్నాయి. ఇష్టదేవతా స్మరణం మంచిది.


సత్సంకల్పంతో పనిచేయండి. విజయం లభిస్తుంది. సకాలంలో బాధ్యతలను పూర్తి చేయాలి. అవరోధాలను అధిగమించి లక్ష్యాన్ని చేరాలి. ప్రోత్సహించేవారున్నారు. సరైన ప్రణాళికను సిద్ధంచేసుకోవాలి. మితభాషణం మేలుచేస్తుంది. ఎదురుచూస్తున్న పనిలో విజయంఉంటుంది. సూర్యనారాయణమూర్తిని ధ్యానించండి, మనోబలం పెరుగుతుంది.


ఆర్థికంగా కలిసివస్తుంది. పేరు ప్రతిష్ఠలు సాధిస్తారు. బాధ్యతగా మీ కర్తవ్యాలను నిర్వహించండి. శాంతంగా సమాధానాలివ్వండి. శ్రమ ఫలిస్తుంది. స్థిరమైన ఫలితాలు సాధిస్తారు. కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి, విఘ్నాలు తొలగుతాయి. కలహాలతో కాలాన్ని వృథా చేయవద్దు. నవగ్రహశ్లోకాలు చదువుకోండి, శాంతి లభిస్తుంది. నవగ్రహశ్లోకాల కోసం క్లిక్‌ చేయండి.


వ్యాపారం బాగుంటుంది. పలుమార్గాల్లో అభివృద్ధి సూచితం. సంకల్పం సిద్ధిస్తుంది. పట్టుదలతో ముందుకు సాగాలి. ఉద్యోగంలో ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తపడాలి. సకాలంలో పనులు పూర్తయ్యేలా చూసుకోవాలి. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. చెడు ఆలోచనలతో అశాంతి కలుగుతుంది. ఒంటరిగా ఉండవద్దు. విష్ణుసహస్రనామం చదువుకోవాలి, కార్యసిద్ధి ఉంటుంది


బ్రహ్మాండమైన శుభకాలం. అద్భుతమైన విజయాలు సొంతమవుతాయి. శ్రమకు రెట్టింపు ఫలితం లభిస్తుంది. ధర్మమార్గంలో ముందుకెళ్లండి. ఆశయాలు నెరవేరతాయి. అర్హతకు తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. వ్యాపారంలో ఇతరులపై ఆధారపడవద్దు. ఆవేశం పనికిరాదు. శాంతియుత జీవనం గడపాలి. లక్ష్మీధ్యానం శుభప్రదం.


సమయస్ఫూర్తితో వ్యవహరించండి, వ్యాపారంలో విజయాలు సిద్ధిస్తాయి. ప్రణాళికతో పనిచేసి ఉద్యోగంలో అవరోధాలను తొలగించుకోవాలి. ఒత్తిడి పెరగకుండా కార్యాచరణను రూపొందించుకోవాలి. సమష్టి కృషితో ఇబ్బందులు తొలగుతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆవేశం పనికిరాదు. నవ గ్రహశ్లోకాలు చదువుకుంటే శాంతి లభిస్తుంది. నవగ్రహశ్లోకాల కోసం క్లిక్‌ చేయండి.


బాధ్యతలను సకాలంలో పూర్తిచేయండి. ఉత్సాహంగా పనిచేస్తే త్వరగా విజయం లభిస్తుంది. ఆర్థిక వృద్ధి శుభప్రదం. కాలం మిశ్రమంగా ఉంది. ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓర్పు అవసరం. ఏకాగ్రతకు భంగం కలగకుండా పనిచేయాలి. చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టం కలిగిస్తుంది. వారాంతంలో శుభం జరుగుతుంది. శివారాధన మంచిది.


శుభకాలం. ఎటుచూసినా విజయమే గోచరిస్తోంది. ధైర్యంగా, ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకుని సకాలంలో పని పూర్తిచేయాలి. అదృష్టం వరిస్తుంది. సంపదలు పెరుగుతాయి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సంకల్పం సిద్ధిస్తుంది. అధికార లాభం సూచితం. కుటుంబపరంగా ఆనందించే అంశాలున్నాయి. లక్ష్మీదేవిని స్మరించండి, శుభవార్త వింటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు