Weekly Horoscope: రాశిఫలం (మే 28 - జూన్‌ 3)

ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. కాలం మిశ్రమంగా ఉంది. ఓర్పు అవసరం. ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనులు చేయాలి. ఉద్యోగవ్యాపారాల్లో ఏకాగ్రతను పెంచండి.

Updated : 28 May 2023 07:38 IST


ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. కాలం మిశ్రమంగా ఉంది. ఓర్పు అవసరం. ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనులు చేయాలి. ఉద్యోగవ్యాపారాల్లో ఏకాగ్రతను పెంచండి. మనసులో అనుకున్నది సిద్ధిస్తుంది. కుటుంబ సభ్యులతో సౌమ్యంగా మాట్లాడండి. వివాదాలకు తావివ్వకండి. వారాంతంలో మేలు చేకూరుతుంది. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది.


ఉద్యోగం బాగుంటుంది. స్థిర నిర్ణయాలు శక్తినిస్తాయి. భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను రూపొందించండి. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న పనిలో విజయం లభిస్తుంది. వ్యాపారంలో ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి. ముఖ్యవ్యక్తులతో సున్నితంగా వ్యవహరించండి. రుణసమస్యలు తొలగుతాయి. సూర్యారాధన శక్తినిస్తుంది.


శ్రేష్ఠమైన కాలం. ఎటు చూసినా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అదృష్టయోగం ఉంది. శ్రమకు తగిన ప్రతిఫలం, గుర్తింపు లభిస్తాయి. మేలు చేసేవారున్నారు. అద్భుతమైన వ్యాపారయోగం ఉంది. ధర్మ మార్గంలో ముందుకు వెళ్లండి. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. లక్ష్మీధ్యానం శుభప్రదం.


ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. సంకల్ప సిద్ధి కలుగుతుంది. ఏకాగ్రతతో పనిచేయాలి. నిరంతర కృషి అవసరం. ముఖ్య కార్యాలను వాయిదా వేయవద్దు. స్వల్ప ఆటంకాలు ఉన్నా భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. తీసుకున్న నిర్ణయాలను చంచలత్వం లేకుండా అమలుచేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే మంచిది.


అదృష్టకాలం నడుస్తోంది. సకాలంలో పనులు ప్రారంభించి విజయాలు సాధించండి. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. ఇంట్లో శుభాలు జరుగుతాయి. వ్యాపారంలో శ్రద్ధ వహించండి. బుద్ధిబలంతో పని చేస్తే మంచి లాభాలున్నాయి. ధన యోగం సూచితం. భూ గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. ఆనందించే వార్తలు వింటారు. ఇష్టదేవతా స్మరణం మంచిది.


సకాలంలో పనులను ప్రారంభించండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఏకాగ్రత అవసరం. కాలం మిశ్రమంగా ఉన్నందున కొన్నింటిలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. శాంతి లభిస్తుంది.


అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. అలోచించి పనిచేయండి. ప్రశంసించే వారున్నారు. సరైన ప్రణాళికల్ని సిద్ధం చేసి అమలు చేయండి. తోటివారితో శాంతంగా మాట్లాడాలి. అపార్ధాలకు తావివ్వవద్దు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వారాంతంలో శుభవార్త వింటారు. సూర్యుణ్ణి దర్శించండి, మనశ్శాంతి లభిస్తుంది.


అద్భుతమైన వ్యాపార యోగం ఉంది. బుద్ధి బలంతో పనిచేస్తే విశేషమైన ధనలాభాలుంటాయి. పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. శాంతంగా సంభాషించండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆశించిన ఫలితాలు వెంటనే వస్తాయి. భూ గృహ లాభాలు కలుగుతాయి. ఇష్టదేవతను స్మరిస్తే మనోబలం పెరుగుతుంది.


చక్కని శుభకాలమిది. ఆశించిన ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. మీరు అనుకున్న స్థాయికి చేరతారు. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారపరంగా శ్రద్ధ వహించండి. ఇతరులపై ఆధారపడవద్దు. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. మంచి వార్త వింటారు. దుర్గామాత స్మరణ శుభప్రదం.


అద్భుతమైన వ్యాపారయోగం ఉంది. బుద్ధి బలంతో విశేష లాభాలను గడిస్తారు. ఆర్థికంగా మిశ్రమకాలం. రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. ఒక ఆపద నుంచి బయట పడతారు. దేనికీ తొందరపడవద్దు. ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి. నమ్మకంతో ముందుకు వెళ్లండి. ప్రశాంతత లభిస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.


ఉద్యోగంలో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. మనోబలంతో పని చేయండి. అదృష్టయోగం ఉంది. అవసరాలకు తగిన సాయం అందుతుంది. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. వ్యాపారంలో తొందరవద్దు. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఇష్టదైవాన్ని దర్శించండి. కార్యసిద్ధి లభిస్తుంది.


ఉద్యోగం బాగుంటుంది. అధికారుల ప్రశంసలు పొందుతారు. కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ త్వరగా లక్ష్యాన్ని చేరుకోండి. నూతన విషయాలు తెలుసుకుంటారు. పనులు వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేయండి. వ్యాపారంలో అద్భుతమైన విజయం ఉంది. శుభవార్త వింటారు. ఇష్ట దైవాన్ని స్మరించండి, మంచి జరుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..