Updated : 04 Aug 2022 17:04 IST

Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )


ఉద్యోగంలో సత్ఫలితాలుంటాయి. అధికారబలం పెరుగుతుంది. ప్రతిభతో కీర్తిని సంపాదిస్తారు. సమాజంలో ఉన్నతస్థితి గోచరిస్తోంది. ప్రతి పనీ మనసు పెట్టి చేయండి. మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఆర్థికంగా మిశ్రమకాలం నడుస్తోంది. వ్యాపారంలో అధికశ్రమ సూచితం. ఒక సమస్య తొలగుతుంది. దుర్గాదేవిని స్మరించండి, భగవదనుగ్రహం లభిస్తుంది.


అదృష్టయోగాలున్నాయి. స్వల్ప విఘ్నాలున్నా విజయం లభిస్తుంది. లోతుగా ఆలోచించాలి. ధర్మమార్గంలో ముందుకు సాగితే మంచిది. ఉద్యోగంలో తగిన సహకారం లభిస్తుంది. తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. అధికారలాభం ఉంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. చంచలత్వం పనికిరాదు. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. ఇష్టదైవారాధన శ్రేష్ఠం.


మనోబలం విజయానికి మూలం. ముఖ్యకార్యాల్లో శ్రద్ధ చూపాలి. శాంతచిత్తంతో లక్ష్యాలను పూర్తిచేయండి. అధిక చర్చల వల్ల ప్రయోజనం ఉండదు. ఉద్యోగపరంగా మిశ్రమకాలం. చిన్న పొరపాటు కూడా ఆందోళనకు 
గురిచేస్తుంది. వ్యాపారంలో జాగ్రత్త. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. లక్ష్మీనారాయణ మంత్రం చదవండి, శుభం జరుగుతుంది.


అదృష్టయోగముంది. పనిలో నైపుణ్యం పెరుగుతుంది. కాలం అనుకూలంగా ఉంది. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థికవృద్ధి సూచితం. ఉద్యోగంలో గుర్తింపు, గౌరవం పెరుగుతాయి. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. భారీ లక్ష్యాలను నిర్దేశించుకుని తదనుగుణంగా పనిచేయాలి.  సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని స్మరించండి, ఆనందంగా ఉంటారు.


అద్భుతమైన విజయం ఉంది. ఉద్యోగంలో ఉన్నతస్థితి లభిస్తుంది. కొందరివల్ల ఆటంకాలు ఎదురైనా శాంతంగా పరిష్కరించుకోవాలి. వ్యాపారం బాగుంటుంది. అభివృద్ధి దిశగా ఆలోచిస్తారు. మిత్రుల అండతో ఒక పని అవుతుంది. ముఖ్యకార్యాలను మధ్యలో ఆపకుండా జాగ్రత్తగా పూర్తిచేయాలి. ఒత్తిడి పనికిరాదు. గురుగ్రహ శ్లోకం చదివితే మంచిది.


కార్యసిద్ధి ఉంది, పనులు పూర్తవుతాయి.  చంచలత్వం లేకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంది. ఆశయం నెరవేరుతుంది. ఆర్థికస్థితి బాగుంటుంది. వ్యాపారంలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడాలి. సొంతనిర్ణయం, సౌమ్యభాషణం మేలుచేస్తాయి. ఇంట్లోవారితో తర్కించవద్దు. కుజశ్లోకం చదవండి, శుభం జరుగుతుంది.


మానసిక దృఢత్వం కాపాడుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. ఒత్తిడి కలిగించే పరిస్థితులకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి. బాధ్యతలను సకాలంలో పూర్తిచేయాలి. వ్యాపారంలో సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తపడాలి. ధనలాభం ఉంది. దగ్గరివారి సూచనలు అవసరమవుతాయి. నవగ్రహశ్లోకాలు చదవండి, మేలు జరుగుతుంది.


నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. నమ్మిన ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అధికారుల అండ లభిస్తుంది. గుర్తింపు, ప్రశంసలు ఉంటాయి. సకాలంలో చేసే పనులు అద్భుతమైన కార్యసిద్ధినిస్తాయి. బాధ్యతలను సమర్థంగా పూర్తిచేస్తారు. ధనలాభం ఉంది. ఇంట్లో శుభం జరుగుతుంది. సూర్యస్తోత్రం శుభాన్నిస్తుంది.


పట్టుదలతో లక్ష్యాన్ని చేరతారు. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. సున్నితమైన అంశాల్లో లోతుగా ఆలోచించవద్దు. ధర్మమార్గంలో ముందుకుసాగండి. గందరగోళ స్థితినుంచి చాకచక్యంగా బయటపడాలి. వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి. ఆవేశం పనికిరాదు. మితభాషణం మేలు చేస్తుంది. వృథావ్యయం సూచితం. ఇష్టదైవాన్ని ధ్యానిస్తే మేలు.


కాలం అన్నివిధాలా సహకరిస్తోంది. ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ప్రశంసలున్నాయి. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. వ్యాపార విజయం ఉంది. ధనలాభం సూచితం. నూతనమార్గాల్లో పైకి వస్తారు. స్థిరత్వం వస్తుంది. మంచి భవిష్యత్తు, ప్రశాంతమైన జీవితం లభిస్తాయి. మిత్రుల అండ పెరుగుతుంది. ఇష్టదేవతారాధన శుభప్రదం. 


అదృష్టకాలం నడుస్తోంది. కార్యసిద్ధి, అభీష్టసిద్ధి విశేషంగా ఉంటాయి. అధికారలాభం సూచితం. ప్రతిభతో పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. ఆర్థికాంశాలు బాగుంటాయి. ధనధాన్యలాభం ఉంది. బంధుమిత్రులతో ఆనందిస్తారు. వారం మధ్యలో కలిసివస్తుంది. ఇంట్లో శుభం జరుగుతుంది.  సూర్యనారాయణ మూర్తిని స్మరించండి, భవిష్యత్తు బాగుంటుంది.  


మనోబలం కాపాడుతుంది. ఒక ఉపద్రవం నుంచి బయటపడతారు. వ్యాపారబలం పెరుగుతుంది. ఆర్థికస్థితి అనుకూలిస్తుంది. ఉద్యోగంలో సమయానుకూలంగా  వ్యవహరించండి. ఒత్తిళ్లు తగ్గుతాయి. ధనలాభం సూచితం. నిండుమనసుతో చేసే పని కలిసివస్తుంది. ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఆత్మీయులవల్ల లాభపడతారు. శివారాధన మంచిది. 


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని