Weekly Horoscope: రాశిఫలం(మార్చి06- మార్చి 12)

అధికారుల ప్రశంసలుంటాయి. పనిలో విజయంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రుల సలహాలు శక్తినిస్తాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఆర్థికస్థితి బాగుంటుంది. అదృష్టయోగం సూచితం.

Updated : 04 Aug 2022 17:12 IST

Weekly Horoscope: రాశిఫలం(మార్చి06- మార్చి 12)


అధికారుల ప్రశంసలుంటాయి. పనిలో విజయంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రుల సలహాలు శక్తినిస్తాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఆర్థికస్థితి బాగుంటుంది. అదృష్టయోగం సూచితం. ఎదురుచూస్తున్న పని పూర్తి అవుతుంది. ఒక ఉపద్రవం నుండి బయటపడతారు. ఇష్టదైవస్మరణ మనశ్శాంతినిస్తుంది.


ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచితే విజయం త్వరగా లభిస్తుంది. శ్రమనుబట్టి ఫలితాలుంటాయి. అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శించి ప్రశంసలు పొందుతారు. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఒక ఫలితం సంతృప్తినిస్తుంది. ఉత్సాహంతో ముందుకు సాగండి. అభీష్టసిద్ధి, ధనలాభం సూచితం. శివ అష్టోత్తరం పారాయణం చేయండి. మనోబలం పెరుగుతుంది.


అనుకూల ఫలితాలున్నాయి. విజయం త్వరగా సిద్ధిస్తుంది. ఉద్యోగంలో ఉత్తమస్థితి సూచితం. ఆపదలు తొలగుతాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. సంపాదన పెరుగుతుంది. బాధ్యతగా పనిచేసి పెద్దల అనుగ్రహాన్ని పొందాలి. ఒత్తిడిని అధిగమిస్తారు. వ్యాపారం బాగుంటుంది. వారం మధ్యలో కలిసి వస్తుంది. సూర్యనమస్కారం ఉత్తమం.


ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ఒత్తిడి పనికిరాదు. అడుగడుగునా విఘ్నాలు ఎదురవుతాయి. ధైర్యం అవసరం. ప్రతి అడుగూ ఆలోచించి వేస్తే నష్టాన్ని నివారించవచ్చు. మాట పట్టింపులకు పోవద్దు. కార్యసిద్ధే ధ్యేయంగా ముందుకు సాగాలి. ఆర్థికస్థితి అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలు అవసరం. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మంచిది.


దివ్యమైన ఆలోచనలు కలుగుతాయి. బంగారు భవిష్యత్తుకు పునాదివేసే యోగ్యమైన కాలం. స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి. అదృష్టవంతులవుతారు. మేలు చేసేవారున్నారు. సందర్భోచితంగా వ్యవహరించండి. అధికారుల ప్రశంసలు విశ్వాసాన్ని పెంచుతాయి. సమాజంలో కీర్తి లభిస్తుంది. ధర్మమార్గంలో వృద్ధి గోచరిస్తోంది. ఇష్టదైవస్మరణ శుభప్రదం.


ఉద్యోగరీత్యా మంచికాలం నడుస్తోంది. తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. సౌమ్యంగా సంభాషించండి. ఆర్థిక పరిస్థితి అనుకూలం. మొహమాటం వద్దు. సున్నితంగా భావాలను వ్యక్తీకరిస్తే మంచిది. కోరికలు నెరవేరతాయి. కలహాలకు అవకాశమివ్వవద్దు. వ్యాపారపరంగా కృషిని బట్టి లాభం. దుర్గాదేవిని స్మరించండి, మనోబలం పెరుగుతుంది.


శుభకాలం నడుస్తోంది. అద్భుతమైన కార్యసిద్ధి ఉంది. గౌరవం పెరుగుతుంది. ముందస్తు ప్రణాళికలతో ఆర్థికవృద్ధి విశేషంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. సుఖసంతోషాలు ఉన్నాయి. నూతన ప్రయత్నాలు లాభాన్నిస్తాయి. వివాదాలజోలికి వెళ్ళవద్దు. ఇష్టదైవారాధన మంచిది.


అద్భుతమైన విజయం వరిస్తుంది. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేసి పెద్దల ప్రశంసలు పొందుతారు. అవసరాలకు ధనం లభిస్తుంది. వ్యాపారపరంగా నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థికస్థితి గతంకంటే మెరుగవుతుంది. అంచెలంచెలుగా ఎదుగుతారు. మిత్రుల అండ పెరుగుతుంది. ఇష్టదైవాన్ని తలచుకోండి, మనశ్శాంతి లభిస్తుంది.


ఎదురుచూస్తున్న పని పూర్తి అవుతుంది. వ్యాపారం బాగుంటుంది. కోరికలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది. అపోహలు తొలగుతాయి. అధికార లాభం సూచితం. ప్రయోజనకరమైన ఆలోచనలు కలుగుతాయి. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలున్నాయి. మిత్రుల వల్ల మనశ్శాంతి లభిస్తుంది. కుటుంబసభ్యుల సహకారం పూర్తిగా ఉంటుంది. శివధ్యానం ఉత్తమం.


అదృష్టఫలాలు అందుతాయి. ఉద్యోగంలో మిక్కిలి శ్రమ కన్పిస్తోంది. ఒత్తిడి కలిగించే వ్యక్తులున్నారు. ధర్మమార్గంలో, సరైన నిర్ణయాలతో పనులు పూర్తి అవుతాయి. దగ్గరివారితో విభేదాలు రాకుండా జాగ్రత్తపడాలి. వారం మధ్యలో కృషి ఫలిస్తుంది. సమాజ శ్రేయస్సు కోరి చేసే పనులు సత్వర ఫలితాన్నిస్తాయి. వ్యాపారరీత్యా శ్రద్ధ అవసరం. శివధ్యానం శుభప్రదం.


ముఖ్య కార్యాల్లో శ్రద్ధ అవసరం. కాలం వ్యతిరేకంగా ఉంది. చిన్న పొరపాటు జరిగినా శ్రమ పెరుగుతుంది. మనోబలం, ఏకాగ్రత సడలకూడదు. ఉద్యోగంలో కొంత వ్యతిరేకత ఉంటుంది. శాంతచిత్తంతో సమాధానమివ్వాలి. ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్తపడాలి. మొహమాటం ఇబ్బంది పెడుతుంది. నవగ్రహ శ్లోకాలు చదవండి, భవిష్యత్తు బాగుంటుంది.


అదృష్టవంతులు అవుతారు. అన్నివిధాలా కలిసి వచ్చే కాలమిది. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పని చేయండి. తీసుకునే ప్రతి నిర్ణయం మేలు చేస్తుంది. సమస్యలు తొలగుతాయి. స్థిరకీర్తి లభిస్తుంది. సంతృప్తినిచ్చే పనులు మొదలుపెడతారు. కుటుంబపరంగా బాగుంటుంది. ఇష్టదేవతను తలుచుకుంటే మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..