Updated : 22 May 2022 02:43 IST

Weekly Horoscope: గ్రహబలం (మే 22 - 28)


ఉద్యోగంలో లక్ష్యంపై దృష్టి పెట్టండి. తెలియని విఘ్నాలున్నాయి. ఏకాగ్రత అవసరం. యథాలాపంగా ఏ పనీ చేయవద్దు. వ్యాపారంలో కలిసివస్తుంది. శ్రమపెరిగినా అంతిమంగా విజయం ఉంటుంది. ఒత్తిడికి గురిచేసేవారున్నారు. వివాదాల జోలికి పోవద్దు. మిత్రుల సలహా పాటించండి. వారం చివరలో మేలు జరుగుతుంది. ఇష్టదైవస్మరణ మంచిది.


ఉత్సాహంగా పనిచేయండి. అవరోధాలు తొలగుతాయి, అనుకున్న ఫలం దక్కుతుంది. ఉద్యోగంలో బాగుంటుంది. ఆర్థికంగా కలిసివస్తుంది. వ్యాపార లాభాలుంటాయి. గత వైభవం సిద్ధిస్తుంది. తగినంత మానవప్రయత్నంతో సంకల్పాన్ని సాధించగలరు. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుని ధర్మబద్ధంగా ఆచరించండి. సూర్యస్తుతి మేలుచేస్తుంది.


ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉంటూ కార్యసిద్ధిని సాధించాలి. పట్టుసడలకుండా చూసుకోండి. గందరగోళ స్థితి గోచరిస్తోంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలాలు   ఉంటాయి. వ్యాపారంలో శ్రమకు తగ్గ ఫలితం, సమాజంలో పేరు లభిస్తాయి. ఇంట్లోవారి సూచనలను స్వీకరించాలి. విఘ్నాలు చికాకు కలిగిస్తాయి. నవగ్రహ శ్లోకాలు చదవండి, శక్తి లభిస్తుంది.


బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది. ఎటుచూసినా శుభఫలితాలే గోచరిస్తున్నాయి. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలుంటాయి. స్థిరత్వం వస్తుంది. వ్యాపారబలం పెరుగుతుంది. భవిష్యత్తును నిర్మించుకునే కాలమిది. సదవకాశాలు వస్తాయి. లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. ఇష్టదేవతారాధన శ్రేష్ఠం.


అభీష్ట సిద్ధి కలుగుతుంది. మనసు పెట్టి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగం బాగుంటుంది. వ్యాపారంలో స్వల్ప విఘ్నాలున్నాయి. అసార్థాలకు అవకాశమివ్వకూడదు. అవసరాలకు ధనం లభిస్తుంది. ఆనందించే అంశాలున్నాయి. కల నెరవేరుతుంది. విష్ణుసహస్రనామం చదవండి, శుభవార్త వింటారు.


అదృష్టయోగముంది, తగినంత కృషి చేయండి. ప్రయత్నాలు ఫలించే సమయం. ఉద్యోగంలో మేలుచేసేవారున్నారు. గొప్ప ఆలోచనలు వస్తాయి, సకాలంలో ఆచరణలో పెట్టాలి. మొహమాటం వల్ల ఖర్చు పెరుగుతుంది. తోటివారిని కలుపుకెళ్లాలి. మంచి పనులతో కీర్తి సంపాదిస్తారు. ఆదిత్యహృదయం చదవండి, విఘ్నాలు తొలగుతాయి.


ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచాలి. అధికశ్రమతో లక్ష్యాన్ని చేరతారు. విసుగు చెందకుండా పనులు పూర్తిచేసుకోవాలి. ఉద్యోగంలో తెలియని ఆటంకముంటుంది. సమయస్ఫూర్తితో అధిగమించాలి. కలహాలకు అవకాశముంది, నిందలు మోపే వారున్నారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. కుటుంబసభ్యుల సలహాలు పనిచేస్తాయి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.


ఉద్యోగంలో మంచి జరుగుతుంది. కోరికలు ఒక్కొక్కటిగా సిద్ధిస్తాయి. ముఖ్యకార్యాల్లో శీఘ్ర విజయముంది. బాధ్యతలను సమర్థంగా పూర్తిచేస్తారు. అపోహలు తొలగుతాయి. కొత్తబంధాలు చిగురిస్తాయి. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆర్థికంగా కలిసివస్తుంది. గృహవాహనాది ప్రయత్నాలు సఫలమవుతాయి. వస్తుప్రాప్తి సూచితం. సూర్యనమస్కారం శుభప్రదం.


ఉద్యోగఫలితం అద్భుతం. మంచి పనులు చేసి ప్రశంసలు పొందుతారు. అభీష్టాలు సిద్ధిస్తాయి. బుద్ధిబలంతో పెద్దలను మెప్పిస్తారు. బాధ్యతలను సకాలంలో పూర్తిచేయండి. అనుకున్న స్థానం లభిస్తుంది. వ్యాపారం బాగుంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనలాభం ఉంది. ఇంట్లోవారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. ఇష్టదైవదర్శనం మేలుచేస్తుంది.


ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారబలం పెరుగుతుంది. ధనలాభం ఉంది. ధర్మబద్ధంగా వ్యవహరిస్తే కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ లక్ష్యాన్ని చేరుకుంటారు. దేనికీ తొందరవద్దు. మనోబలంతో ముందుకుసాగండి. నిదానంగా మిత్రులతో కలిసి చేసే పనులు త్వరగా కార్యసిద్ధిని ఇస్తాయి. విష్ణుమూర్తిని స్మరించండి, ప్రశాంతమైన జీవితం లభిస్తుంది.


వ్యాపారం అనుకూలం. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో సులభంగా విజయం లభిస్తుంది. ధనలాభముంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సరైన ప్రణాళికలతో మంచి భవిష్యత్తును సాధించండి. అపార్థాలకు తావివ్వకుండా పట్టువిడుపులతో ముందుకు సాగాలి. ఆదిత్యహృదయం చదవండి, కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది.


ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలుంటాయి. అధికారులనుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. అభీష్టసిద్ధి ఉంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి. లక్ష్మీఅనుగ్రహం లభిస్తుంది. ఆవేశపరిచే పరిస్థితులు ఉంటాయి. సంయమనాన్ని పాటించండి. వ్యాపారంలో జాగ్రత్త. ధర్మమార్గంలో పయనించండి. మిత్రుల అండ లభిస్తుంది. శివారాధన ఉత్తమం.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని