రాశిఫలం గ్రహబలం ( అక్టోబరు 9 - 15 )

ఉద్యోగంలో అధికార లాభముంటుంది. నిర్మలమైన మనసుతో న్యాయబద్ధంగా నడచుకుంటే విజయం మీదే అవుతుంది. పరీక్షించే వ్యక్తులున్నారు. సౌమ్యంగా సమాధానమివ్వాలి. ఓర్పు అవసరం. అపరిచితులతో చనువుగా ఉండవద్దు.

Updated : 09 Oct 2022 06:52 IST

రాశిఫలం గ్రహబలం ( అక్టోబరు 9 - 15 )


ఉద్యోగంలో అధికార లాభముంటుంది. నిర్మలమైన మనసుతో న్యాయబద్ధంగా నడచుకుంటే విజయం మీదే అవుతుంది. పరీక్షించే వ్యక్తులున్నారు. సౌమ్యంగా సమాధానమివ్వాలి. ఓర్పు అవసరం. అపరిచితులతో చనువుగా ఉండవద్దు. మిత్రుల వల్ల శాంతి లభిస్తుంది. కొత్తగా ఆలోచిస్తూ వ్యాపారాన్ని వృద్ధిచేయాలి. నవగ్రహశ్లోకాలు చదివితే మంచిది.


ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. మీ పనులు అందరికీ నచ్చుతాయి. ఒక మెట్టు పైకి ఎక్కుతారు. తగిన గౌరవం లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మంచి జీవితం లభిస్తుంది. గృహ వాహనాది యోగాలున్నాయి. అర్హతలను పెంచుకుంటూ ముందుకెళ్లాలి. కాలం సహకరిస్తోంది. ఆశయాలు నెరవేరతాయి. సూర్యనమస్కారం శక్తినిస్తుంది.


ఉత్తమ కార్యాచరణతో విజయం లభిస్తుంది. ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచాలి. అధికార లాభం సూచితం. వ్యాపారంలో శుభం జరుగుతుంది. మంచి ఆలోచనలతో లక్ష్యాన్ని చేరండి. అన్నివిధాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు చేపట్టే పనులు స్థిరమైన భవిష్యత్తునిస్తాయి. నూతన ప్రణాళికలు సిద్ధిస్తాయి. ఆదిత్యహృదయం చదివితే మేలు.


మంచి కాలం నడుస్తోంది. ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెట్టండి. సద్గోష్ఠి వల్ల జ్ఞానం లభిస్తుంది. కృతనిశ్చయంతో ముందుకెళ్లండి, అదృష్టవంతులవుతారు. ఒక సమస్య నుంచి బయటపడతారు. చంచలత్వం లేకుండా పనిచేయండి. ధనలాభం ఉంది. వ్యాపారంలో ఆటంకాలున్నప్పటికీ ధైర్యంగా అధిగమిస్తారు. దుర్గాదేవిని స్మరిస్తే శాంతి లభిస్తుంది.


వ్యాపార లాభముంది. నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి. విజ్ఞానపరంగా అభివృద్ధి ఉంటుంది. ప్రయత్నబలం ఉంటే తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. ధర్మమార్గాన్ని అనుసరించండి. లక్ష్యం చేరువలోనే ఉంది. సందేహించకుండా నిర్ణయం తీసుకోండి. సంపదలు పెరుగుతాయి. సమష్టిగా చేసే పనులు లాభాన్నిస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేష్ఠం.


అదృష్ట ఫలాలు అందుతాయి. బద్ధకించకుండా పనిచేయాలి. ఉద్యోగరీత్యా అనుకూల కాలం. ఒత్తిడి కలిగించే పరిస్థితులున్నాయి. చాకచక్యంగా వ్యవహరించాలి. బాధ్యతలను సక్రమంగా పూర్తిచేయాలి. పనులను ఆపకుండా క్రమపద్ధతిలో చేయాలి. సత్యనిష్ఠ ముందుకు నడిపిస్తుంది. కుటుంబపరంగా కలిసివస్తుంది. విష్ణుస్మరణ శక్తిని ప్రసాదిస్తుంది.


ఏకాగ్రతతో పని మొదలుపెట్టండి. అడుగడుగునా విఘ్నాలున్నాయి. ధర్మచింతన మేలుచేస్తుంది. ఉద్యోగంలో ఆటంకం తొలగుతుంది. అపార్థాలకు తావివ్వవద్దు. సంభాషణలో స్పష్టత అవసరం. ఇంట్లో వారి సూచన పనిచేస్తుంది. ఆపదల నుంచి బయటపడతారు. చెడు ఆలోచనలు వద్దు. వ్యాపారంలో జాగ్రత్త. నవగ్రహధ్యానం మంచిది.


దైర్యంగా పనులు ప్రారంభించండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. కాలం సహకరిస్తోంది. అభీష్టసిద్ధి ఉంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. స్థిరంగా నిర్ణయం తీసుకోండి. విఘ్నాలు తొలగుతాయి. ఆర్థికంగా కలిసివస్తుంది. గృహ వాహనాది లాభాలుంటాయి. మిత్రులవల్ల మంచి జరుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభాలు జరుగుతాయి.


ఉద్యోగంలో తగినంత గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలుంటాయి. ప్రతిభతో అభివృద్ధి సాధిస్తారు. సాధనలో లోపం లేకుండా చూసుకోవాలి. అనుకున్నది సాధించే కాలమిది. పట్టుదలతో పనిచేయండి. జీవితాశయం నెరవేరుతుంది. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వ్యాపారం శుభప్రదం. ధనధాన్య లాభముంటుంది. ఇష్టదేవతాస్మరణ మనోబలాన్నిస్తుంది.


స్థిరచిత్తంతో పని ప్రారంభించండి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా ఫలితం సానుకూలంగా ఉంటుంది. ప్రతిభతో పెద్దలను ఆకర్షిస్తారు. మీవల్ల కొందరికి మేలు జరుగుతుంది. శత్రుదోషం తొలగుతుంది. మొహమాటాన్ని పక్కనపెడితే మంచి భవిష్యత్తు లభిస్తుంది. సమష్టికృషి కుటుంబ సభ్యులకు  శుభాన్నిస్తుంది. ఇష్టదైవాన్ని ధ్యానించండి, శుభవార్త వింటారు.


ఉద్యోగంలో అద్భుతంగా ఉంటుంది. సకాలంలో పనులు ప్రారంభిస్తే తిరుగులేని ఫలితాలు సిద్ధిస్తాయి. ఆలోచనలు ప్రగతివైపు నడిపిస్తాయి. అధికార బలం పెరుగుతుంది. ఆదర్శంగా నిలుస్తారు. బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధించే కాలమిది. కొత్తగా ఆలోచించాలి. క్షమాగుణంతో పనిచేస్తే కీర్తిమంతులవుతారు. ఆదిత్యస్తుతి మేలుచేస్తుంది.


మనోబలంతో విఘ్నాలను అధిగమించాలి. స్థిరచిత్తంతో ముందడుగేయండి. ధర్మం కాపాడుతుంది. ఉద్యోగరీత్యా మిశ్రమకాలం. సద్బుద్ధితో పనిచేయాలి. వారంమధ్యలో ఒక కార్యం సఫలమవుతుంది. వృథా వ్యయం పనికిరాదు. ఆపద నుంచి బయటపడతారు. కుటుంబసభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించండి, శాంతి లభిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..