Weekly Horoscope: రాశిఫలం (Sep 17th to 23rd)
ఈ వారం ఏ రాశి వారికి.. ఎలాంటి ఫలితం ఉంటుందంటే
గ్రహబలం (సెప్టెంబరు 17 - 23 )
ఉద్యోగంలో విజయం సాధిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధైర్యంగా చేసే పనుల్లో విశేష లాభాలుంటాయి. విజ్ఞానపరంగా పరిశోధనలు చేయడానికి అనుకూలమైన సమయం. గృహ నిర్మాణాది పనుల్లో పురోగతి ఉంటుంది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ప్రతి పనీ ఇంట్లోవారికి చెప్పి చేయాలి. వాగ్వివాదాలకు దిగవద్దు. లక్ష్మీధ్యానం ఐశ్వర్యప్రదం.
వ్యాపారయోగం బాగుంది. లక్ష్యం చేరువలోనే ఉంది. కష్టపడి పనిచేయండి. శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించాలి. చంచల నిర్ణయాలు పనికిరావు. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. స్థిరచరాస్తులు అభివృద్ధి చెందుతాయి. ఆశయం నెరవేరేవరకూ శ్రమించాలి. పనులు వాయిదా వేయవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. లక్ష్యమే ధ్యేయం కావాలి. శివారాధన శక్తినిస్తుంది.
ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి. పనులను ఇతరులకు పురమాయించకుండా స్వయంగా చేసుకోవాలి. ఒత్తిడికి గురికావద్దు. బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శాంతంగా సంభాషించాలి. మొహమాటం
వల్ల శ్రమ పెరుగుతుంది. సూర్యనమస్కారం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
శ్రేష్ఠమైన ఫలితాలుంటాయి. నమ్మకం గెలిపిస్తుంది. ఉద్యోగంలో ప్రతిభ చూపి అద్భుత మైన ఫలితాలు సాధిస్తారు. ఎటుచూసినా విజయమే గోచరిస్తోంది. వ్యాపారంలో లాభాలున్నాయి. మేలు చేసేవారున్నారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మేలైన భవిష్యత్తు సొంతమవుతుంది. అదృష్ట వంతులవుతారు. ఆస్తులు వృద్ధిచెందుతాయి. మహాలక్ష్మీ ధ్యానం శుభప్రదం.
ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉన్నత స్థితికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే అగ్రగామిగా నిలబడతారు. కొన్ని విషయాల్లో మీ శక్తిసామర్థ్యాలకు పరీక్షా కాలంగా అనిపిస్తుంది. సొంత నిర్ణయాలు మేలుచేస్తాయి. వృథావ్యయాన్ని నివారించాలి. ధ్యానానికి సమయం కేటాయించండి. ఈశ్వర ఆరాధన కార్యసిద్ధిని ఇస్తుంది.
సమర్థతతోనే శ్రేష్ఠమైన ఫలితాలు సాధ్యం కనుక విశేషమైన కృషి అవసరం. విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండాలి. ఒక అవకాశం చేతిదాకా వస్తుంది. కాలాన్ని మంచి పనులకై వినియోగిస్తే అదృష్టం వరిస్తుంది. బంధుమిత్రుల సహకారాలుంటాయి. ఖర్చుల్ని నియంత్రించండి. సూర్యనారాయణ మూర్తిని స్మరించండి, ప్రశాంతత లభిస్తుంది.
వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. పలుమార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విశేష ధనలాభముంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రత్యేక గుర్తింపుకై కృషిచేయండి. పనుల్ని వాయిదావేయకుండా పూర్తిచేయండి. ధర్మమార్గంలో ముందుకు సాగండి. కొందరివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఓర్పుతో పనిచేసి లక్ష్యాన్ని సాధించండి. ఇష్టదేవతాధ్యానం శుభప్రదం.
అద్భుతమైన శుభయోగాలున్నాయి. ఎదురు చూస్తున్న విజయం లభిస్తుంది. పదవీ లాభముంది. మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది. వ్యాపారంలో జాగ్రత్తపడితే ధన ధాన్యాభివృద్ధి కలుగుతుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. మహాలక్ష్మీ అమ్మవారిని స్మరించండి, మంచి ఫలితాలు సాధిస్తారు.
ఉద్యోగంలో మంచి ఫలితాలుంటాయి. అధికారయోగం సూచితం. నూతన బాధ్యతలు వస్తాయి. ఇంటా బయటా కార్యసిద్ధి లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా ఆర్థిక స్థితిగతులను మెరుగు పరుచుకుంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రుణసమస్యలు తొలగుతాయి. భూ గృహ వాహన యోగాలున్నాయి.శుభవార్త వింటారు. ఇష్టదేవతాధ్యానం ఆనందాన్నిస్తుంది.
ముఖ్యకార్యాల్లో ఏకాగ్రత అవసరం. కాలం వ్యతిరేకంగా ఉంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. మీ బాధ్యతలను మీరు నిర్వర్తించడం ద్వారా ఇబ్బందులను అధిగమించవచ్చు. అపార్థాలకు తావివ్వవద్దు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే సంతృప్తికరమైన ఫలితాలు సాధించ వచ్చు. సహనం మిమ్మల్ని రక్షిస్తుంది. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచిది.
లక్ష్యంపై దృష్టి పెట్టండి. బాధ్యతాయుతమైన ప్రవర్తన మేలుచేస్తుంది. ఎవరినీ నమ్మవద్దు. కర్తవ్యదీక్షతో పనిచేసి అధికారుల ప్రశంసలు పొందుతారు. తొందరలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారంలో నష్టాన్ని నివారించవచ్చు. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. నవగ్రహశ్లోకాలు చదువుకోండి, శుభవార్త వింటారు.
మనోబలంతో ముందుకు సాగుతూ మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. విశేష ధనలాభాలుంటాయి. అవరోధాలు తొలగుతాయి. అదృష్టవంతులు అవుతారు. నూతన విషయాలు తెలుసు కుంటారు. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది. ఎవరితోనూ విభేదాలు వద్దు. ఇష్టదేవతను స్మరించండి, బంగారు భవిష్యత్తు లభిస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Nara Lokesh: వైకాపా అధికారంలోకి వచ్చిన రోజు నుంచే అక్రమ కేసులు: నారా లోకేశ్
-
Janasena: తెలంగాణలో 32 చోట్ల జనసేన పోటీ.. జాబితా ఇదే
-
Chromebook: భారత్‌లో క్రోమ్‌బుక్‌ల తయారీ ప్రారంభం.. రూ.15,990కే కొత్త క్రోమ్‌బుక్!
-
Hyderabad: హోమ్‌వర్క్ చేయలేదని పలకతో కొట్టిన టీచర్.. బాలుడి మృతి
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ruturaj Gaikwad: ధోనీ నుంచి నేర్చుకున్నా.. కెప్టెన్సీలో నా స్టైల్ నాదే: రుతురాజ్ గైక్వాడ్