Weekly Horoscope: రాశిఫలం (జులై 7 - జులై 13)

ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 07 Jul 2024 07:42 IST

 


అదృష్టకాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. కచ్చితంగా వాటిని అమలు చేయండి. ఉద్యోగులకు పదోన్నతి సూచనలున్నాయి. భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. దీర్ఘకాలిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారంలో ఓ మెట్టు పైకి ఎదుగుతారు. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి.


మనోబలం అవసరం. గ్రహాలు వ్యతిరేకంగా నడుస్తున్నాయి. అవరోధాలు ఎదురుకావచ్చు. పట్టుదలతో ఆ సవాళ్లను అధిగమించండి. ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి. ధనయోగం సూచితం. మొహమాటం వల్ల ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. అధికారుల నుంచి స్వల్ప ఇబ్బందులు ఎదురుకావచ్చు. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


వ్యాపార యోగం శుభప్రదం. మంచి ఫలితాలు ఉంటాయి. కీలక సమయాల్లో తెలివిగా వ్యవహ రించండి. ప్రశాంతంగా బాధ్యతలు నిర్వర్తించండి. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. బుద్ధిబలంతో ఆపదల నుంచి బయట పడతారు. స్వర్ణాభరణ యోగం ఉంది. వారం మధ్యలో ఓ మంచివార్త వింటారు. ఓర్పు అవసరం. సూర్యభగవానుడిని ఆరాధించండి.


ఏకాగ్రతతో లక్ష్యాల దిశగా అడుగులు వేయండి. ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉత్తమ నిర్ణయాలు కొత్త శక్తినిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రగతి ఉంటుంది. ఆర్థిక స్థితి క్రమంగా మెరుగవుతుంది. శత్రుదోషం తొలగుతుంది. మిత్రబలాన్ని పెంచుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. విష్ణుమూర్తిని ధ్యానించండి.


ఆత్మవిశ్వాసంతో అడుగేస్తారు. ఉద్యోగంలో మేలైన ఫలితాలు ఉంటాయి. గతానుభవాల్ని విస్మరించవద్దు. వివాదాలను కోరికోరి ఆహ్వానించకండి. కాలమాన పరిస్థితులకు తగినట్టు నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని రంగాల్లోని వారికి పరీక్షా కాలం. అధిక గ్రహాలు దోష స్థానంలో ఉండటం వల్ల అవరోధాలు తప్పవు. ఆత్మబలంతో ఎదిరించండి. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


అదృష్ట ఫలాలు అందుతాయి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఆచరణ యోగ్యమైన లక్ష్యాలనే ఎంచుకోండి. ఉద్యోగంలో పదోన్నతి గోచరిస్తోంది. సృజనాత్మకతతో వ్యాపార విజయాలు సాధిస్తారు. వారం మధ్యలో ఓ పని పూర్తవుతుంది. ఆత్మీయులతో విభేదాలకు ఆస్కారం ఇవ్వకండి. ఆర్థికంగా ఓ మెట్టు పైకి చేరుకుంటారు. లక్ష్మీదేవిని ధ్యానించండి.


మనోబలం అవసరం. కష్టాన్ని బట్టి ఫలితం ఉంటుంది. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తోటి వ్యక్తులతో సౌమ్యంగా వ్యవహరించండి. ఓర్పు, నమ్మకం చాలా అవసరం. పరిస్థితులను బట్టి పట్టువిడుపులతో పనిచేయాలి. కొన్నిసార్లు మౌనమే ఉత్తమం. మీ సంస్కారమే మీకు రక్షణ కవచం అవుతుంది. నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


ఉద్యోగంలో మేలు జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల ప్రశంసలు అందుతాయి. బాధ్యతల్ని సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల ప్రోద్బలంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. శుక్రయోగం సిరిసంపదలను ప్రసాదిస్తుంది. గృహ, వాహన యోగాలున్నాయి. భూలాభం సూచితం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఇష్ట దైవాన్ని ఆరాధించండి.


ధనయోగం ఉంది. బుద్ధిబలంతో విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో జాగ్రత్తగా అడుగేయాలి. ఎందుకంటే, గ్రహరీత్యా అవరోధాలు అధికంగా ఉన్నాయి. మనోబలంతో ఒత్తిడిని అధిగమిస్తారు. నిర్ణయాల్లో చంచలత్వం వద్దు. కీలక సమయాల్లో ఆరంభ శూరత్వం ప్రదర్శిస్తే మొదటికే మోసం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి.


ప్రారంభించిన పనుల్లో కార్యసిద్ధి ఉంది. తక్షణ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వండి. సంక్లిష్టమైన నిర్ణయాలు వాయిదా వేయడం ఉత్తమం. ప్రతిభతో పదిమందినీ మెప్పిస్తారు. బుద్ధిబలంతో ఆటంకాలను తొలగించుకుంటారు. మిశ్రమ కాలం నడుస్తోంది. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు వద్దు. వృథా వ్యయాలు తగ్గించుకోవాలి. నాగేంద్రుడిని స్మరించండి.


వ్యాపారాన్ని విస్తరిస్తారు. కాకపోతే, మరింత బలంగా ప్రయత్నించాలి. కొద్దిపాటి ఆటంకాలున్నాయి. బుద్ధిబలాన్ని ఉపయోగించండి. తోటివారి మన్ననలు అందుకుంటారు. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. భూలాభం సూచితం. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. మిత్రుల సాయం అందుతుంది. నవగ్రహాల్ని పూజించండి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


శుక్ర గ్రహ అనుగ్రహంతో ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. కొత్త నిర్ణయాలతో ప్రయోజనాన్ని పొందుతారు. ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యాన్ని పెంచుకుంటారు. సంకోచం వద్దు. చెడును ఊహించవద్దు. ముఖ్యమైన పనులు వాయిదా వేయకండి. ఆత్మీయుల పట్ల ప్రేమాభిమానాలు చూపండి. వ్యాపారంలో అవరోధాలున్నాయి. నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..